🔴Live News Updates: UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Hulk Hogan: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి

హల్క్ హోగన్ అమెరికలోని ప్రముఖ స్టార్ లలో ఒకరు. 1980, 90లలో రెజ్లింగ్ ఛాంపియన్ గా పేరు పొందారు. తన బాడీతో ఆ రోజుల్లో జనాల్ని ఉర్రూతలూగించారు. ఈయన అసలు పేరు టెర్రీ జి.బొలియా. అమెరికాలోని జార్జియా లో 1953లో జన్మించారు. ప్రస్తుతం హోగన్ వయసు 71 ఏళ్ళు. ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్ ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులు డాక్టర్లను ఇంటికి పిలిపించారు. ఆ తరువాత హోగన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు. గుండెపోటు కారణంగా హోగన్ చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. 

Also ReadMumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ట్రంప్ కు మద్దతు..

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు హోగన్ మద్దతు పలికారు. ఉత్సాహంగా ప్రచారం లో కూడా పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో షర్ట్ తీసి, టీషర్ట్ చించుకుంటూ ఉద్రేకంగా ప్రసంగించడం అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. ఆయన ప్రసంగం తర్వాత ఇతర సభ్యులతో పాటు ట్రంప్‌ కూడా నిల్చొని చప్పట్లతో హోగన్‌ను అభినందించారు. ఇటీవలే ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది. దాని నుంచి ఆయన కోలుకుంటున్నారని హోగన్ భార్య స్కై డైలీ చెప్పారు. కానీ కొద్దిరోజుల్లోనే హార్ట్ అటాక్ తో మరణించడంతో ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.  

Also Read: USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్

  • Jul 25, 2025 21:44 IST

    UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో

    UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి.  యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.

    upi



  • Jul 25, 2025 21:34 IST

    రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్!

    భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

    veda



  • Jul 25, 2025 21:02 IST

    హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్.. ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ

    హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేటలో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా అయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

    Hyderabad rains



  • Jul 25, 2025 18:41 IST

    ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? వేగంగా రక్తంలో కలిసిపోయి!

    చాలామంది మద్యం ప్రియులు తిన్నాక తాగలేము కాబట్టి..  మద్యం సేవించాక తిందామని అనుకుంటారు. అయితే ఇది చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం ఇంక ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. 

    drikers



  • Jul 25, 2025 18:13 IST

    శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!

    గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా బర్రెపిల్ల అంటూ ఊగిపోయాడు. హరిహర వీరమల్లు సినిమా వారికి చెంపదెబ్బ, చెప్పుదెబ్బ అని అన్నారు.

    shymala-roka

     



  • Jul 25, 2025 16:42 IST

    ట్రెండ్ సెట్ చేద్దామని నడి రోడ్డు మీద కారుపై డ్యాన్స్..

    ముంబైకి చెందిన 24 ఏళ్ల యువతి నాజ్మీన్ సుల్డే పబ్లిక్ అంతా ఉండగానే కదిలే మెర్సిడెస్-బెంజ్ కారు బోనెట్ మీద "ఆరా ఫార్మింగ్ డాన్స్" చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

     

    Viral video
    Viral video

     



  • Jul 25, 2025 16:41 IST

    మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!

    YCP కీలక నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి జిల్లా ఎస్పీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన గన్ మెన్ ను సస్పెండ్ చేశారు. ఇటీవల మిథున్ రెడ్డితో ములాఖత్ కు వెళ్లిన సమయంలో గన్ మెన్ పెద్దిరెడ్డి బ్యాగులు మోశారు. ఇది విధుల్లో భాగం కాదంటూ.. ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Peddireddy Ram Chandra Reddy



  • Jul 25, 2025 16:41 IST

    తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!

    తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను దళారులు మోసం చేశారు. ప్రతి భక్తుని నుంచి రూ.1,500 చొప్పున వాహన క్లీనర్ వెంకటేష్‌కు రూ.8500 వసూలు చేశారు. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

    ttd devotees



  • Jul 25, 2025 16:40 IST

    టెన్త్లో 92 శాతం మార్కులు.. చనిపోయిన అమ్మ పిలిచిందని సూసైడ్!

    తన తల్లి ఇటీవల మరణించడంతో మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలుడు మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శివశరణ్ భూతాలి టాల్కోటి అనే బాలుడు తన మామ ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు.

    tenth



  • Jul 25, 2025 15:49 IST

    కొంపముంచిన ఫ్రూట్‌ జ్యూస్‌ డైట్..యూట్యూబ్‌ వీడియోలు చూసి

    యూట్యూబ్‌ చూసి మూడు నెలలుగా ఫ్రూట్‌ జ్యూస్‌ డైట్ ఫాలో అయిన ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన యువకుడు శక్తీశ్వరన్‌ బాడీ షేప్ కోసం ప్రయత్నించాడు.

    fruite-juice



  • Jul 25, 2025 15:49 IST

    డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

    హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. యాప్‌ను ఉపయోగించి బోడుప్పల్‌, చెంగిచెర్లలోని ఇళ్లకు వెళ్లి గృహాలలో లబ్ధిదారులే నివసిస్తున్నారా లేదా అనే సమాచారం సేకరించనున్నారు.



  • Jul 25, 2025 15:48 IST

    టెన్త్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్.. హైదరాబాద్ లో పెను విషాదం!

    ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ చిచ్చు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 5 రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడం స్థానికంగా కలకలం రేపుతోంది.

     

    Hyderabad Miyapur Tenth Student Incident
    Hyderabad Miyapur Tenth Student Incident

     



  • Jul 25, 2025 14:43 IST

    బస్సు డ్రైవర్కు గుండెపోటు.. స్టీరింగ్‌ పైనే కుప్పకూలిపోయాడు!

    ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బస్సు నడుపుతూ ఉండగా ఓ ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.  

    bus-driver



  • Jul 25, 2025 14:31 IST

    ఐటీ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఆ ప్రముఖ కంపెనీలో 25 వేల మంది ఔట్!

    ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ భావిస్తోంది.

     

    Intel
    Intel

     

     

     



  • Jul 25, 2025 14:30 IST

    పాక్‌ దొంగబుద్ధి.. రెండు ఉగ్రస్థావరాలు మళ్లీ యాక్టివేట్‌

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్‌ మరో కొత్త ఎత్తుగడ వేసింది. అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది.

     

    Pakistan Lashkar e Taiba reactivated two terrorist camps Abdullah Bin Masood and Chela Bandi
    Pakistan Lashkar e Taiba reactivated two terrorist camps Abdullah Bin Masood and Chela Bandi

     



  • Jul 25, 2025 14:00 IST

    Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

    దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ నిద్ర మత్తులో కారు నడుపుతూ వచ్చి నేరుగా ఇంటి గోడపైకి ఎక్కించాడు! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

     

    Viral Car Incident
    Viral Car Incident

     



  • Jul 25, 2025 12:59 IST

    Prison: ఎంతకి తెగించావ్ రా, జైలు గోడ దూకి పరారైన ఖైదీ.. చివరికి ఊహించని షాక్

    2011లో కేరళలో ఓ హత్యాచార కేసు సంచలనం రేపింది. ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామీ (49) ప్రస్తుతం కన్నూర్‌ సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున అతడు పోలీసుల కళ్లు గప్పి జైలు గొడ దూకి పరారయ్యాడు.

     

    Prison
    Prison

     



  • Jul 25, 2025 11:26 IST

    Mumbai: ఓరి నీ కామం తగలెయ్య.. పక్కింట్లో కోడి అరుపులు.. వెళ్లి చుస్తే..!

    ముంబై నగరంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని బోరివలిలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కోడిపై అత్యాచారం చేశాడు. పక్కింటి పిల్లోడికి పోర్న్ చూపించి లైంగికంగా వేధించాడు. బోరివాలి పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

     

    Mumbai Man Raped Hen
    Mumbai Man Raped Hen

     



  • Jul 25, 2025 10:28 IST

    War 2 Trailer: 'వార్ 2' ట్రైలర్‌ వచ్చేసింది.. ఇక వార్ వన్ సైడే..!

    ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘వార్ 2’ ట్రైలర్‌ విడుదలైంది. ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్ తో, అద్భుతమైన యాక్షన్‌ సీన్స్‌తో ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ ని అందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలకానుంది.

     

    war 2 trailer
    war 2 trailer

     



  • Jul 25, 2025 10:08 IST

    Tirupati: కళ్లు తెరిచిన శివయ్య.. తిరుపతిలో మహాద్భుతం.. వీడియో వైరల్!

    తిరుపతిలోని గాంధీపురంలో మహా అద్భుతం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా ఆలయానికి పోటెత్తారు.

     

    Shiva Lingam Opened Eyes Tirupati
    Shiva Lingam Opened Eyes Tirupati

     



  • Jul 25, 2025 10:07 IST

    BIG BREAKING: హైదరాబాద్ లో చిరుత కలకలం.. ఆ ఏరియాల్లో హై అలర్ట్!

    హైదరాబాద్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది.  మంచిరేవుల EIPL రివర్ ఎడ్జ్‌ విల్లాస్ పక్కన ఉన్న ఒక కొండపై చిరుత కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు.

     

    leopard in Hyderabad
    leopard in Hyderabad

     



  • Jul 25, 2025 10:07 IST

    Earthquake Indonesia: మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!

    ఇండోనేషియాలో జూలై 24, 25 వ తేదీల మధ్య తెల్లవారుజామున 2 AM గంటలకు సులవెసీ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవలి 3 నెలల కాలంలో ఇండోనేషియాలో పలుమార్లు భూకంపాలు వచ్చాయి.

     

    Earthquake Indonesia
    Earthquake Indonesia

     



  • Jul 25, 2025 07:35 IST

    Cancer Symptoms in Telugu: మన శరీరంలో క్యాన్సర్ ను పసిగట్టడం ఎలా?

    క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించకపోయినా, శరీరంలోని మార్పులను గమనిస్తే ముందే గుర్తించవచ్చు. గొంతు, బ్రెస్ట్, లివర్ వంటి క్యాన్సర్లకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి వైద్య సలహా తీసుకోవడం అవసరం.

     

    Cancer Symptoms in Telugu
    Cancer Symptoms in Telugu

     



  • Jul 25, 2025 07:35 IST

    4th Test: నాలుగో టెస్ట్ లో బజ్ బాల్ ఆటతో దుళ్ళగొడుతున్న ఇంగ్లాండ్

    నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ తెగ ఆడేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బ్రిటీష్ జట్టు ఇంకా బ్యాటింగ్ చేస్తోంది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేయగా..ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. 

     

    4th test
    England Batting In 4th Test

     



  • Jul 25, 2025 07:35 IST

    Britain: కోట్ల కోసం కాళ్ళు నరుక్కున్న డాక్టర్

    ఇన్సూరెన్స్..ఇదో పెద్ద మాఫియా. ఈ డబ్బుల కోసం రకరకాల వేషాలు వేస్తుంటారు. బతికున్నవాళ్ళను చనిపోయినట్లు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా యూకేలో ఒక డాక్టర్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా తన కాళ్ళనే నరుక్కున్నాడు. 

     

    britan
    Britain Doctor

     



  • Jul 25, 2025 07:34 IST

    Madhya Pradesh: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !

    మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలికి అదృష్టం తలుపు తట్టింది. పన్నా జిల్లాలోని హర్‌గోవింద్‌ యాదవ్ అనే రోజువారి కూలీకి నిసార్ అనే గనిలో 8 వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాల విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

     

    Labourer Couple Finds Eight Diamonds Worth Lakhs After Years Of Digging In Madhya Pradesh Mine
    Labourer Couple Finds Eight Diamonds Worth Lakhs After Years Of Digging In Madhya Pradesh Mine

     



  • Jul 25, 2025 07:34 IST

    దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్‌ చేస్తే ఊహించని షాక్

    మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. ఈ అమానుష ఘటన యావత్మర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

     

    Widowed Woman Sold By In-Laws For Rs 1.20 Lakh, Abused For Two Years In Gujarat
    Widowed Woman Sold By In-Laws For Rs 1.20 Lakh, Abused For Two Years In Gujarat

     



Advertisment
తాజా కథనాలు