HYD Crime: ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ చిచ్చు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. హన్సిక, షేక్ రిజ్వాన్ అనే ఇద్దరు విద్యార్థులు మాధవనగర్ లోని ఓ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నారు. ఒకే తరగతి కావడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ వరకు వెళ్ళింది. అయితే ఒక రోజు రిజ్వాన్ క్లాస్ లో చాటింగ్ చేస్తుండగా గమనించిన ప్రిన్సిపాల్ అతడి తల్లికి ఫిర్యాదు చేశారు.
Also Read:Varun Tej: సో క్యూట్.. అప్పుడే బేబీ కోసం వరుణ్ షాపింగ్.. ఏం కొన్నాడో చూడండి!
ఇద్దరూ సూడైడ్
తల్లికి చెప్పడంతో మనస్థాపానికి గురైన రిజ్వాన్ అదేరోజు స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమ కొడుకు చావుకు ఆ అమ్మాయే కారణమంటూ హన్సికను దూషించారు రిజ్వాన్ కుటుంబం. స్కూల్ యాజమాన్యం కూడా హన్సికను పాఠశాలకు రానివ్వలేదు. దీంతో హన్సిక కూడా మనస్థాపం చెంది వాళ్ళ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 19న రిజ్వాన్ సూసైడ్ చేసుకోగా.. 24న హన్సిక సూసైడ్ చేసుకుంది. ఇలా 5 రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడం స్థానికంగా కలకలం రేపుతోంది. తెలిసి తెలియని వయసులో వీరు చేసిన తప్పు ఇరు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ఇటీవలే మరో విషాదం..
ఇదిలా ఉంటే ఇటీవలే హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన చింతల యామిని గచ్చిబౌలి లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. గౌలిదొడ్డి ప్రాంతంలోని జేకే గ్రాండ్ హాస్టల్‌లో నివాసం ఉంటుంది. కొన్ని రోజులుగా పెళ్లి సమస్యలతో మనోవేదన చెందుతున్న యామిని.. గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది.