Earthquake Indonesia: మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!

ఇండోనేషియాలో జూలై 24, 25 వ తేదీల మధ్య తెల్లవారుజామున 2 AM గంటలకు సులవెసీ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవలి 3 నెలల కాలంలో ఇండోనేషియాలో పలుమార్లు భూకంపాలు వచ్చాయి.

New Update
Earthquake Indonesia

Earthquake Indonesia

Earthquake Indonesia: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. జూలై 24,  25 వ తేదీల మధ్య, సుమారు తెల్లవారుజామున  2:20 గంటల సమయంలో, సులవెసీ ప్రాంతంలోని మినాహాసా వద్ద భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. భారీ భూకంపం కావడంతో, ప్రజలు భయంతో ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు.

భారీ భూకంపం..

ఇండోనేషియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనే భూభాగంలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఒకటి. ఇటీవలి మూడు నెలల కాలంలో ఇండోనేషియాలో పలుమార్లు భూకంపాలు వచ్చాయి.

అలాగే, సెరామ్ ద్వీపం వద్ద రెండు రోజుల క్రితం 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. గతంలో ఇక్కడే మే 23న 5.9 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. అయితే ఈ రెండు సందర్భాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అదే విధంగా, మే నెలలో దక్షిణ సుమాత్రాలో, జూలై నెలలో తనిమ్బర్ ద్వీప సమీపంలో కూడా భూకంపాలు సంభవించాయి.

Also Read: వామ్మో.. పడక సుఖం ఇవ్వడం లేదని భర్తను చంపేసిన భార్య

ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఎక్కువగా భూకంపాలు నమోదవుతుంటాయి. ముఖ్యంగా ఇండోనేషియా ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండటం వల్ల అక్కడ భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రభావం ఎక్కువగా ఉంటాయి. 2004లో సుమాత్రా వద్ద 9.2 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం, భారీ సునామీకి కారణమైంది.

Also Read: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !

భారత్‌లో కూడా భూకంపాలు

భారతదేశంలో కూడా ఇటీవల కొన్ని భూకంపాలు నమోదయ్యాయి. జూలై 10న ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యాణాలో 4.4 తీవ్రతతో భూమి కంపించింది. ఫిబ్రవరి 28న లద్దాఖ్‌లో 3.5 తీవ్రత, ఫిబ్రవరి 16న బంగాళాఖాతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇంకా అదే నెలలో ఢిల్లీలో కూడా చిన్నపాటి భూమి కంపించాయి.

Advertisment
తాజా కథనాలు