CM Revanth Reddy : ఖర్గే నివాసానికి చేరుకున్న రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి...రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చలు

ఢిల్లీ  పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్, రాహుల్‌తో కలిసి ఖర్గే నివాసానికి చేరుకున్నారు.

New Update
Rahul Gandhi, CM Revanth Reddy reach Kharge's residence

Rahul Gandhi, CM Revanth Reddy reach Kharge's residence

CM Revanth Reddy : ఢిల్లీ  పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్, రాహుల్‌తో కలిసి ఉదయం 10 గంటలకు ఖర్గే నివాసానికి చేరుకున్నారు. భేటీలో భాగంగా తెలంగాణలో శాస్త్రీయంగా నిర్వహించిన కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరిస్తున్నారు. అసెంబ్లీ, శాసనసభల్లో విద్యా, ఉపాధి, ఉద్యోగావకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులను ఆమోదించి కేంద్ర ఆమోదానికి పంపినట్లుగా వారికి తెలిపారు.

Also Read: డిజిటల్‌ అరెస్ట్.. ఇద్దరు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్‌ కేటుగాడు

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజికవర్గాల వారీగా వివరాలపై కూడా వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.  రాష్ట్రంలో సామాజిక, ఆర్థక, విద్యా, ఉపాధిపై సీఎం వివరిస్తున్నారు. శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్చలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌లో కులగణన, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలని సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కోరారు. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు సిపెక్‌ కమిటీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.

Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం

కాగా, సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ (AICC) కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఆవశ్యకతను తెలుపుతూ.. కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన రెండు బీసీ బిల్లులను లోక్‌సభతో పాటు రాజ్యసభలో ఆమోదించి రాజ్యాగంలోని షెడ్యూల్‌-9 పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను సీఎం రేవంత్ కోరనున్నారు.

Also Read:Hari Hara Veera Mallu Review: పవన్ వన్ మ్యాన్ షో.. 'హరిహర వీరమల్లు' ఫుల్ రివ్యూ !

Advertisment
తాజా కథనాలు