4th Test: నాలుగో టెస్ట్ లో బజ్ బాల్ ఆటతో దుళ్ళగొడుతున్న ఇంగ్లాండ్

నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ తెగ ఆడేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బ్రిటీష్ జట్టు ఇంకా బ్యాటింగ్ చేస్తోంది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేయగా..ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. 

New Update
4th test

England Batting In 4th Test

బజ్ బాల్ ఆటతో దుళ్ళగొడుతోంది. గబగబా పరుగులు చేస్తూ పరుగులు రాబడుతోంది. దీంతో టీమ్ ఇండియా టఫ్ ఫైట్ ను ఎదుర్కోంటోంది. ఇప్పటికి రెండు రోజుల ఆట జరిగింది. మొదట ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసిన భారత్ ఆల్ అవుట్ అయింది. రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసింది. వన్డే, టీ20 తరహాలో పరుగులు చేస్తోంది. ఓపెనర్లు డకెట్‌  100 బంతుల్లో 13×4లతో 94 పరుగులు, క్రాలీ  113 బంతుల్లో 13×4, 1×6లతో 84 చెలరేగి ఆడారు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 264 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత బ్యాటర్లు 358 పరుగులు చేసింది. గాయంతో బరిలోకి దిగిన పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. 

విఫలమైన బౌలర్లు..

ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఇంకా 133 పరుగులు మాత్రమే చేయాలిజ ఈరోజు మూడో రోజు భారత బౌలర్లు ఎవరు బ్రిటీష్ బ్యాటర్లను కట్టడి చేస్తారు అన్నదానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంది. ఓపెనర్లు డకెట్, క్రాలీలు దూకుడుగా ఆడారు. ఎంత చిన్న అవకాశం చిక్కినా బౌండరీలు కొట్టారు. ఇప్పుడు మూడోరోజు కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు అలానే ఆడితే భారత స్కోరును వాళ్ళు దాటేస్తారు. శార్దూల్‌ ఠాకూర్‌ మరింత ధారాళంగా పరుగులిచ్చాడు. 5 ఓవర్లలో ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. జడేజా తొలి ఓవర్లో క్రాలీ సిక్స్, ఫోర్‌ బాదేశాడు. చూస్తుండగానే స్కోరు 150 దాటేసింది. బుమ్రా పరుగులు తక్కువగానే ఇచ్చినా వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ :

 యశస్వి జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58; రాహుల్‌ (సి) క్రాలీ (బి) వోక్స్‌ 46; సాయి సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61; శుభ్‌మన్‌ గిల్‌ ఎల్బీ (బి) స్టోక్స్‌ 12; పంత్‌ (బి) ఆర్చర్‌ 54; జడేజా (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 20; శార్దూల్‌ (సి) డకెట్‌ (బి) స్టోక్స్‌ 41; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) వోక్స్‌ (బి) స్టోక్స్‌ 27; అన్షుల్‌ కాంబోజ్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; బుమ్రా (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 4; సిరాజ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 30 మొత్తం: (114.1 ఓవర్లలో ఆలౌట్‌) 358; వికెట్ల పతనం: 1-94, 2-120, 3-140, 4-235, 5-266, 6-314, 7-337, 8-337, 9-349; బౌలింగ్‌: వోక్స్‌ 23-5-66-1; ఆర్చర్‌ 26.1-3-73-3; కార్స్‌ 21-1-71-0; స్టోక్స్‌ 24-3-72-5; డాసన్‌ 15-1-45-1; రూట్‌ 5-0-19-0

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ :

 క్రాలీ (సి) రాహుల్‌ (బి) జడేజా 84; డకెట్‌ (సి) జురెల్‌ (బి) కాంబోజ్‌ 94, పోప్‌ బ్యాటింగ్‌ 20; రూట్‌ బ్యాటింగ్‌ 11; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225; వికెట్ల పతనం: 1-166, 2-197; బౌలింగ్‌: బుమ్రా 13-4-37-0; అన్షుల్‌ కాంబోజ్‌ 10-1-48-1; సిరాజ్‌ 10-0-58-0; శార్దూల్‌ 5-0-35-0; జడేజా 8-0-37-1

Advertisment
తాజా కథనాలు