/rtv/media/media_files/2025/07/25/mumbai-man-raped-hen-2025-07-25-11-20-13.jpg)
Mumbai Man Raped Hen
Mumbai: ముంబై నగరంలోని బోరివలి వెస్ట్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికాని ఓ వ్యక్తి తన పెంపుడు కోడిపై అత్యాచారం చేశాడు(Mumbai Man Raped Hen). అదే కాకుండా తన పక్కింట్లో ఉండే 10ఏళ్ల అమాయకపు పిల్లవాడికి పోర్న్ చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు, ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే,
ముంబై బోరివలి వెస్ట్ లో 48 ఏళ్ల ఓ మేకప్ ఆర్టిస్ట్ తన భార్య, కూతురు, 10 ఏళ్ల కొడుకుతో నివసిస్తున్నాడు. అయితే జూన్ 22న ఆదివారం ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం అతను టెర్రస్ వద్దకు వెళ్లి అక్కడి నుండి మొదటి అంతస్తులో నివసిస్తున్న తన పొరుగు వ్యక్తిని వాళ్ళ ఇంటి కిటికీ లో నుండి చూడగా ఆ ఇంట్లో ఉన్న పెళ్లి కానీ సదరు వ్యక్తి తన పెంపుడు కోడిని ముద్దు పెట్టుకుని, ఆ తర్వాత దానితో అసభ్యకరమైన పనులు చేస్తున్నట్లు గమనించాడు. ఈ ఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయిన మేకప్ ఆర్టిస్ట్ తన ఫోన్ లో ఆ దారుణాన్ని రికార్డు చేసి తన భార్యకి చూపించాడు. ఈ విషయంతెలుసుకున్న తన 10 ఏళ్ల కొడుకు మరో భయంకరమైన విషయం చెప్పాడు, 'అమ్మా, ఇదే అంకుల్ నాకు పోర్న్ వీడియోలు చూపించేవాడు, ఎవరికీ చెప్పవద్దని బెదిరించేవాడు.' అని చెప్పాడు.
దింతో కుటుంభం సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పోలీసులకి ఫిర్యాదు చేదాం అన్న సిగ్గుతో బయపడి చేయకుండా ఉండిపోయారు. చివరికి వాళ్ళ కుటుంబ స్నేహితుడి సలహా మేరకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. వెంటనే బోరివాలి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 351(2), పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేశారు.