/rtv/media/media_files/2025/07/25/tenth-2025-07-25-16-26-41.jpg)
తన తల్లి ఇటీవల మరణించడంతో మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలుడు మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శివశరణ్ భూతాలి టాల్కోటి అనే బాలుడు తన మామ ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు. బాలుడి తల్లి మూడు నెలల క్రితం కామెర్లు కారణంగా మరణించింది. ఇంట్లో దొరికిన సూసైడ్ లో బాలుడు ఈ విధంగా రాశాడు.
'నేను శివశరణ్. బతకాలని లేకపోవడం వల్లే చనిపోతున్నాను. నా తల్లి వెళ్ళే సమయానికి నేను వెళ్ళిపోవాల్సింది, కానీ నేను మామయ్య, అమ్మమ్మ ముఖాలను చూస్తూ బతికే ఉన్నాను. నా మరణానికి కారణం నిన్న నా కలలో నా తల్లి వచ్చింది. ఎందుకు అంత బాధపడుతున్నావ్.. తన దగ్గరకు రమ్మని చెప్పింది. కాబట్టి నేను చనిపోవాలని అనుకున్నాను. నా మామయ్య, అమ్మమ్మలకు నేను చాలా కృతజ్ఞుడను, ఎందుకంటే వారు నాకు చాలా బాగా చూసుకున్నారు" అని నోట్‌లో ఉంది. "
Also Read : 'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!
Also Read : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
నా చెల్లిని సంతోషంగా చూసుకోండి
అంకుల్, నేను చనిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత, నా చెల్లిని సంతోషంగా చూసుకోండి. అంకుల్. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మమ్మను నాన్న దగ్గరకు పంపకండి. నా తల్లిదండ్రుల కంటే మీరు నన్ను ఎక్కువగా చూసుకున్నారని చెప్పాడు, తన మరణానికి తానే బాధ్యుడని నోట్ లో వెల్లడించాడు. శివశరణ్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 10వ తరగతిలో 92 శాతం మార్కులు సాధించిన శివచరణ్ డాక్టర్ కావాలని కోరుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై షోలాపూర్ నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Also Read : నా భార్య ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్!
Also Read : కొంపముంచిన ఫ్రూట్ జ్యూస్ డైట్..యూట్యూబ్ వీడియోలు చూసి
telugu-news | suicide | student | maharashtra | solapur