UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్..  ట్రాన్సాక్షన్ లిమిట్లో

UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి.  యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.

New Update
upi

UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి.  యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది. ఈ మార్పులు ముఖ్యంగా యూపీఐ సిస్టమ్‌పై ఉన్న భారాన్ని తగ్గించి, లావాదేవీల వేగాన్ని, విశ్వసనీయతను పెంచడానికి ఉద్దేశించినవి.  ఆగస్టు 1నుం రోజుకు 50 సార్లు మాత్రమే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సర్వర్‌లపై భారాన్ని తగ్గించడం దీని ఉద్దేశ్యం. మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని మీరు రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలరు. ఇది కూడా అనవసరమైన API కాల్స్‌ను తగ్గించడానికే.  

ఇకపై నిర్దిష్ట సమయాల్లో

మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్లు, SIPలు, EMIలు లేదా ఇతర పునరావృత చెల్లింపుల కోసం సెట్ చేసుకున్న ఆటోపేమెంట్లు ఇకపై నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఈ ఆటోపేమెంట్లు పీక్ అవర్స్‌లో (ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు) ప్రాసెస్ కావు. ఇవి నాన్-పీక్ అవర్స్‌లో మాత్రమే జరుగుతాయి: దీనివల్ల పీక్ అవర్స్‌లో సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. యూపీఐ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సర్వర్లపై భారాన్ని తగ్గించి, సిస్టమ్ స్థిరత్వాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను పెంచడం ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత UPI ట్రాన్సాక్షన్ లిమిట్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. 

Also Read :  Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు

Advertisment
తాజా కథనాలు