Pakistan: పాక్‌ దొంగబుద్ధి.. రెండు ఉగ్రస్థావరాలు మళ్లీ యాక్టివేట్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్‌ మరో కొత్త ఎత్తుగడ వేసింది. అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది.

New Update
Pakistan Lashkar e Taiba reactivated two terrorist camps Abdullah Bin Masood and Chela Bandi

Pakistan Lashkar e Taiba reactivated two terrorist camps Abdullah Bin Masood and Chela Bandi

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్‌ మరో కొత్త ఎత్తుగడ వేసింది. 2019లో బాలాకోట్‌ దాడి తర్వాత మూసేసిన లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది. ఈ రెండింట్లో ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.  

అంతేకాదు లష్కరే తోయిబా తమ ఉగ్రవాదుల బస కోసం నాలుగు చిన్న తాత్కాలిక టిన్‌లను కూడా నిర్మించింది. అలాగే ఓ కొత్త వాచ్‌ టవర్‌ను కూడా నిర్మించింది. వీటిని శాటిలైట్‌ చిత్రాల ద్వారా గుర్తించారు. లష్కరే తోయిబా ముజఫరాబాద్‌లోని సిరికోట్‌లో జూన్ నుంచే పాత లాంచింగ్ ప్యాడ్ అయిన అబ్దుల్లా బిన్ మసూద్‌ను పునరుద్ధరిస్తోందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. జూన్ నాటి చిత్రాలు ఈ లాంచింగ్‌ ప్యాడ్‌పై వాచ్‌ టవర్‌ను నిర్మించినట్లు స్పష్టంగా చూపించాయి. 

Also Read: ఎంతకి తెగించావ్ రా, జైలు గోడ దూకి పరారైన ఖైదీ.. చివరికి ఊహించని షాక్

Also Read :  'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!

Pakistan Lashkar E Taiba Reactivated Two Terrorist Camps

అలాగే జులైలో వచ్చిన శాటిలైట్‌ చిత్రాల్లో లష్కరే తోయిబా తమ లాంచింగ్‌ ప్యాడ్‌లో టిన్‌తో నాలుగు చిన్న కొత్త తాత్కాలిక నిర్మాణాలు కూడా నిర్మించినట్లు తేలింది. వీటిని ఉగ్రవాదులు బస చేసేందుకు ఉపయోగిస్తారని చూపించాయి. ఉగ్రవాదులు ప్రార్థనలు చేసే హాలు పక్కనే వీటిని నిర్మించారు. ఇదిలాఉండగా 2019లో బాలకోట్‌ దాడికి ముందు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్‌ సైన్యం సాయంతో శిక్షణ పొందడమే కాకుండా వారి శిక్షణ శిబిరంలో కూడా నివసించేవారు.

Also Read: భారత్ పై చైనా భారీ కుట్ర.. ఓ వైపు భారీ డ్యామ్.. మరో వైపు వార్ బేస్ నిర్మాణం!

జులై 8న లష్కరే తోయిబాకు చెందిన బహవల్‌పూర్‌ మర్కజ్‌ అధిపతి సైఫుల్లా సైఫ్‌, అలాగే అంతర్జాతీయ ఉగ్రవాది ముజమ్మిల్‌ హష్మీ వాళ్ల సహచరులతో కలిసి చెలా బండి క్యాంప్‌కు వెళ్లారు. అక్కడ చాలా ఏళ్లుగా పీవోకేలో లష్కరే తోయిబా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ కమాండర్ అబూ మువాజ్‌ కూడా వాళ్లతో ఉన్నాడు. మొత్తానికి ఆపరేషన్ సిందూర్‌ తర్వాత లష్కరే తోయిబా నిలిచిపోయిన తమ ఉగ్రకార్యకలాపాలను పునరుద్ధరించింది. 

Also Read :  తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!

telugu-news | rtv-news | pakistan | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
తాజా కథనాలు