/rtv/media/media_files/2025/07/25/viral-car-incident-2025-07-25-13-55-27.jpg)
Viral Car Incident
Viral News:
రాత్రివేళ నిద్ర మత్తులో వాహనం నడిపితే ఏ స్థాయి ప్రమాదాలు జరుగుతాయో తాజాగా మేడ్చల్ జిల్లాలో ఓ సంఘటన అందుకు ఉదాహరణగా నిలిచింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్‌లో ఓ డ్రైవర్ నిద్ర మత్తులో కారు నడుపుతూ వచ్చి నేరుగా ఇంటి గోడపైకి ఎక్కించాడు(Viral Car Incident)!
ఇంటి యజమానులు రాత్రి సడన్ గా భారీ శబ్దం విన్నారు. బయటకు వెళ్లి చూశారు, కారు ఏకంగా వాళ్ల ఇంటి గోడపై ఉంది! ఈ దృశ్యం చూసి వారు ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నిద్రమత్తులో ఇంటిగోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025
మేడ్చల్ - దుండిగల్ పియస్ పరిదలోని శంభీపూర్‌లో కారు బీభత్సం
కారును క్రేన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/PZUcNw0KW7
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్ సాయంతో కారును కిందకు దింపించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ కారు ఎలా గోడపైకి ఎక్కిందన్న విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. నిజంగానే నిద్ర మత్తు లో జరిగిందా లేక మద్యం మత్తు లో జరిగిందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Also Read: వామ్మో.. పడక సుఖం ఇవ్వడం లేదని భర్తను చంపేసిన భార్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. "బ్రో, కారుని అక్కడ ఎలా పెట్టావ్?", "ఇంకో క్వార్టర్ వేసుంటే అక్కడే దింపేవాడేమో!" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !