/rtv/media/media_files/2025/07/25/bus-driver-2025-07-25-14-31-43.jpg)
ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బస్సు నడుపుతూ ఉండగా ఓ ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నుంచి బెంగళూరుకు గురువారం రాత్రి బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులోకి రాగానే డ్రైవర్ రసూల్(50)కు గుండెపోటు వచ్చింది.
Also Read : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!
Also Read : ట్రెండ్ సెట్ చేద్దామని నడి రోడ్డు మీద కారుపై డ్యాన్స్.. చివరకు ఏమైందంటే?
ప్రయాణికులు అప్రమత్తం
దీంతో ఆయన స్టీరింగ్‌పై కుప్పకూలారు. బస్సు మెల్లిగా పక్కకు వెళ్లి ఆగడంతో ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. స్టీరింగ్‌పై కుప్పకూలిన డ్రైవర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. రసూల్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సును రాయచోటి ఆర్టీసీ డిపోకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన అందరిని కలిచివేసింది.
Also Read : నా భార్య ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్!
ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (ఫాస్ట్ ఫుడ్, అధిక కొవ్వు, అధిక చక్కెర), అధిక ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అధిక బరువు, ఊబకాయం రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దారితీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఎడమ చేతికి నొప్పి వంటి గుండెపోటు లక్షణాలను గుర్తించి, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
Also Read : 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
telugu-news | bus-driver | Andhra Pradesh | heart-attack