/rtv/media/media_files/2025/07/25/drikers-2025-07-25-18-35-08.jpg)
ఆల్కహాల్ తాగేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు. చాలామంది మద్యం ప్రియులు తిన్నాక తాగలేము కాబట్టి.. మద్యం సేవించాక తిందామని అనుకుంటారు. అయితే ఇది చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం ఇంక ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
వేగంగా రక్తంలో కలిసిపోయి
ఖాళీ కడుపుతో మద్యం తాగితే, ఆల్కహాల్ చాలా వేగంగా రక్తంలో కలిసిపోయి త్వరగా మత్తుకు గురవుతారు. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి, కడుపులో మంట, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మద్యం తాగే ముందు కచ్చితంగా ఏదైనా తినాలి. ఆల్కహాల్‌ను గబగబా తాగడం వల్ల శరీరం దాన్ని ప్రాసెస్ చేయడానికి తగినంత సమయం దొరకదు. ఫలితంగా, త్వరగా మత్తు ఎక్కి, నియంత్రణ కోల్పోతారు. నెమ్మదిగా, విరామం తీసుకుంటూ తాగడం మంచిది.
Also Read: Beer & whiskey : మందులో బీరు కలిపి కొడుతున్నారా... జరిగేది ఇదే!
ఆల్కహాల్ శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట వంటి హ్యాంగోవర్ లక్షణాలు తీవ్రమవుతాయి. అందుకే, ప్రతి డ్రింక్‌కు మధ్య ఒక గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇక ఒకేసారి బీరు, విస్కీ, వైన్ వంటివి మార్చి మార్చి తాగడం వల్ల శరీరం గందరగోళానికి గురై, త్వరగా మత్తు ఎక్కుతుంది. దీనివల్ల హ్యాంగోవర్ కూడా తీవ్రంగా ఉంటుంది. ఒకే రకమైన ఆల్కహాల్‌కు పరిమితం అవ్వడం మంచిది. ఎలా మద్యం సేవించిన మితంగా మద్యం సేవించడం అనేది చాలా ముఖ్యం. మద్యపానం ఆరోగ్యానికి హానికరమే కాకుండా దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది ఇది గర్తుపెట్టుకోవాలి.
Also Read : Light Beer vs Strong Beer : లైట్ బీరు మంచిదా..స్ట్రాంగ్ బీరు మంచిదా?
Also Read : Sperm Count Tips: స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి.. వరదలా పారుతాయి!
alcohol | Alcohol Tips | Health Tips | telugu-news