Tirupati: శివుడు మూడో కన్ను తెరవడం, భక్తుడి ఘోర తప్పసుకు మెచ్చి ప్రత్యక్షమవడం వంటి సినిమాల్లోనే చూస్తుంటాము. కానీ, ఇలాంటివి నిజజీవితంలో కూడా జరుగుతాయని ఎప్పుడైనా ఊహించారా? ఏంటి.. అసలు నిజజీవితంలో ఇలాంటి జరుగుతాయా? అని ఆశ్చర్యపోతున్నారా! అవునండీ ఇది నిజంగానే జరిగింది. సాక్ష్యాత్తు ఆ ఏడుకొండలవారు వెలసిన తిరుపతిలోనే ఈ అద్భుతం వెలుగుచూసింది.
Also Read: PM Modi: ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టిన మోదీ..అత్యంత ఎక్కువ టైమ్ ప్రధానిగా..
కళ్ళు తెరిచిన శివయ్య
తిరుపతిలోని గాంధీపురంలో స్థానికంగా ఉన్నరామలింగేశ్వర స్వామి శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీలో ఆలయం కిక్కిరిసిపోయింది.ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.