/rtv/media/media_files/2025/07/24/supreme-court-stays-bombay-hc-verdict-acquitting-12-accused-in-2006-mumbai-train-blasts-case-2025-07-24-14-24-28.jpg)
Supreme Court stays Bombay HC verdict acquitting 12 accused in 2006 Mumbai train blasts case
2006లో జరిగిన ముంబయి రైలు పేలుళ్ల ఘటనలో 12 నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మరో సంచలన అప్‌డేట్ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కానీ హైకోర్టు ఆదేశాలను అనుసరించి జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వే లైన్‌లో పలు సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు బాంబు పేలుళ్లు జరిగాయి. కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే ఇవి జరిగాయి. ఈ ప్రమాదంలో 189 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మంది గాయాలపాలయ్యారు.అయితే ఈ దాడులకు లష్కర్- ఎ -తోయిబా, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత 2015లో అక్టోబర్‌లో స్పెషల్ కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది.
Also Read: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్ బోర్డుకు తరలింపు..
వీళ్లలో ఐదుగురికి బాంబు అమర్చారనే అభియోగాలపై మరణశిక్ష విధించింది. అలాగే మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మరణశిక్ష పడిన నిందుతుల్లో కమల్ అన్సారీ, పైజల్ షైక్, ఎస్తేషామ్ సిద్ధిఖీ, నవేద్ హుస్సేన్, ఆసిఫ్ బషీర్ ఖాన్‌లు ఉన్నారు. జీవిత ఖైదు శిక్ష పడిన వాళ్లలో షేక్ ఆలం షేక్ (41), మహ్మద్ సాజిద్ అన్సారీ (34) తన్వీర్ అహ్మద్ అన్సారీ (37), సోహిల్ మెహమూద్ షేక్ (43), జమీర్ అహ్మద్ షేఖ్ (36), మహ్మద్ మాజిద్ షఫీ (32), మజ్జమిల్ షేక్ (27) ఉన్నారు.
అయితే వీళ్లలో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కరోనా వల్ల నాగ్‌పుర్ జైలులో మృతి చెందాడు. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వాటిని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ కేసు వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఆ తర్వాత 2024లో జులైలో హైకోర్టు రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.
Also Read: డిజిటల్ అరెస్ట్.. ఇద్దరు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్ కేటుగాడు