/rtv/media/media_files/2025/07/25/prison-2025-07-25-11-58-56.jpg)
Rape and murder convict Govindachamy arrested after escape from Kannur jail
2011లో కేరళలో ఓ హత్యాచార కేసు సంచలనం రేపింది. ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామీ (49) ప్రస్తుతం కన్నూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున అతడు పోలీసుల కళ్లు గప్పి జైలు గొడ దూకి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు బృందాలు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. చివరికి అతడి ఆచూకి కనిపెట్టారు. కన్నూర్‌లోనే నేషనల్ సర్వే సబ్ రీజినల్ ఆఫీస్ వెనుకున్న బావి మెట్ల కింద అతడు దాక్కున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: మణిపుర్‌పై కీలక అప్‌డేట్.. రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 7.15 గంటలకు ఖైదీల లెక్కింపు సమయంలో గోవిందచామీ లేడని జైలు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అతడు జైలు గదిలోని ఇనుప కడ్డీలను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దుస్తులతో తయారు చేసుకొన్న తాడు సాయంతో జైలు గోడ దూకి పారిపోయినట్లు పేర్కొన్నారు. అతడికి సంబంధించిన తాజా ఫొటోను కూడా విడుదల చేశారు. ఎవరైనా అతడిని గుర్తిస్తే తమకు సమాచారమివ్వాలని కోరారు. మరోవైపు ఒంటిచేయి ఉన్న గోవిందచామీ జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు తప్పించుకునేందుకు జైల్లో ఉన్నతాధికారుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గోవిందచామీని అరెస్టు చేసి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏంటి ఈ కేసు ?
కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన యువతి (23) ఓ షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుండేది. 2011 ఫిబ్రవరి 1న ఎప్పట్లాగే పని ముగిశాక ఎర్నాకుళం నుంచి షోరనూర్‌కు ప్యాసింజర్ రైలులో వెళ్లింది. అయితే మహిళా కోచ్‌లో ఆమె ఒంటిరిగా ఉంది. ఇది గమనించిన గోవిందచామి ఆమె దాడి చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు నుంచి ఆమెను తోసేసి, తానూ బయటికి దూకాడు. ఆ తర్వాత ఆ యువతిపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి రైలు పట్టాల దగ్గర పడున్న బాధితురాలిని అక్కడి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది.
Also Read: భారత్ పై చైనా భారీ కుట్ర.. ఓ వైపు భారీ డ్యామ్.. మరో వైపు వార్ బేస్ నిర్మాణం!
ఈ ఘటన అప్పట్లో కేరళలో సంచలనం రేపింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ కేసుపై త్రిస్సూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. దీంతో కోర్టు గోవిందచామీని దోషిగా తెలుస్తూ 2012లో మరణశిక్ష విధించింది. ఆ తర్వాత కేరళ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. చివరికి అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2016లో దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి అతడు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.