/rtv/media/media_files/2025/07/25/fruite-juice-2025-07-25-15-01-01.jpg)
తమిళనాడులో దారుణం జరిగింది. యూట్యూబ్ చూసి మూడు నెలలుగా ఫ్రూట్ జ్యూస్ డైట్ ఫాలో అయిన ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన యువకుడు శక్తీశ్వరన్ బాడీ షేప్ కోసం వ్యాయామం చేయడం ప్రారంభించాడు. ఓ యూట్యూబ్ లోని వీడియో చూసి దానిని ప్రేరణగా తీసుకుని డైట్ ఫాలో అయ్యాడు. అయితే గురువారం రోజున ఒక్కసారిగా ఉన్నట్టుండి ఊపిరాడక మృతిచెందాడు. తెలిపిన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శక్తిశ్వరన్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చాలా చురుకైన వ్యక్తి అని తెలిపారు. అయితే ఏ వైద్యుడిని సంప్రదించకుండానే ఓ యూట్యూబ్ లోని వీడియో చూసి దానిని ప్రేరణగా తీసుకుని డైట్ ఫాలో అయ్యాడన్నారు.
Also Read : 'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!
Also Read : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
ఇంట్లో కుప్పకూలిపోయాడు
గురువారం అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఇంట్లో కుప్పకూలిపోయాడని వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించామని అయితే కొద్దిసేపటికే అతను మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారన్నారు. శక్తిశ్వర్ కు 17 ఏళ్ల కాగా స్థానికంగా ఉన్న ఇంటర్ కాలేజ్‌లో ఇంటర్ కంప్లీట్ చేశాడు. ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే అతను చనిపోవడం కుటుంబ సభ్యులను షాక్ కు గురి చేసింది. ప్రస్తుత కాలంలో చాలా మందికి బరువు తగ్గాలని, స్లిమ్‌గా కనిపించాలని కోరిక ఉంటుంది. దీని కారణంగానే చాలా మంది డైట్, వ్యాయామం చేస్తున్నారు. అయితే వైద్యుల సలహాలు పాటించకుండా ఏదీ పడితే అది చేయడం ప్రాణాలకే ముప్పని నిపుణులు అంటున్నారు.
Also Read : 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
Also Read : బస్సు డ్రైవర్కు గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు!
YouTube Diet | tamil-nadu | suffocation | telugu-news