/rtv/media/media_files/2025/07/25/labourer-couple-finds-eight-diamonds-worth-lakhs-after-years-of-digging-in-madhya-pradesh-mine-2025-07-25-07-27-02.jpg)
Labourer Couple Finds Eight Diamonds Worth Lakhs After Years Of Digging In Madhya Pradesh Mine
సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూర్ తదితర ప్రాంతాల్లో రైతులకు లేదా కూలీలకు వజ్రాలు దొరికిన వార్తలు చాలానే చూశాం. ఒక్క వజ్రం దొరికిన వాటి విలువ లక్షల్లో ఉంటుంది. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా అప్పుడప్పుడు ఇలా వజ్రాలు దొరికిన ఘటనలు జరుగుతుంటాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని మరో దినసరి కూలికి అదృష్టం తలుపు తట్టింది. పన్నా జిల్లాలోని హర్‌గోవింద్ యాదవ్ అనే రోజువారి కూలీకి నిసార్ అనే గనిలో 8 వజ్రాలు దొరికాయి.
Also Read: దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్ చేస్తే ఊహించని షాక్
ఆ వజ్రాల విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛతర్‌పుర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, పవన్‌దేవి దంపతులు గత అయిదేళ్లుగా పన్నా జిల్లాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు. ఇలా ఎప్పట్లాగే పనికి వెళ్లగా వారికి కాలం కలిసొచ్చింది. తాజాగా ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు.
Also Read: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి
అయితే వీటి విలువను నిపుణులు నిర్ధారించిన తర్వాత వేలంలో వచ్చిన మొత్తం నుంచి ట్యాక్స్ మినహాయించి మిగతా డబ్బును గోవింద్ కుటుంబానికి అప్పగిస్తారు. దీనిపై హర్‌గోవింద్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' భగవంతుడు ఈసారి మమ్మల్ని కరుణించాడు. గతంలో కూడా మాకు ఓ వజ్రం దొరికింది. అప్పుడు సరైన అవగాహన లేక కేవలం రూ.లక్ష మాత్రమే నా చేతికి వచ్చినట్లు'' చెప్పాడు.