దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్‌ చేస్తే ఊహించని షాక్

మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. ఈ అమానుష ఘటన యావత్మర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
Widowed Woman Sold By In-Laws For Rs 1.20 Lakh, Abused For Two Years In Gujarat

Widowed Woman Sold By In-Laws For Rs 1.20 Lakh, Abused For Two Years In Gujarat

మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. ఈ అమానుష ఘటన యావత్మర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఆర్నీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురు, అత్త మామలతో కలిసి జీవిస్తోంది. ఇటీవల ఆమె భర్త, కొడుకు చనిపోయారు. దీంతో అత్త మామాలు ఆమెతో విసుగు చెందారు. ఆమెను అమ్మేయాలని నిర్ణయించారు. చివరికి 2023లో ఆమెకు మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.1.20 లక్షలకు అమ్మేశారు. 

Also Read: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం

అలా రెండేళ్ల పాటు అతడు ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఆ మహిళ ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఆ తర్వాత అతడు ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. చివరికి ఆమె సొంతూరులో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటికే ఆమె కనిపించకుండా పోయినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆర్నీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మళ్లీ ఆమె అక్కడికి రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు అత్తమామలు వారి ఇద్దరి బంధువులు మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు