USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్

అమెరికాలో ఉన్న పెద్ద టెక్ కంపెనీలు ఇక మీదట భారతీయులకు జాబ్స్ ఇవ్వడం మానేయాలని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అమెరికన్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ట్రంప్ పాలనలో అమెరికన్లకే ప్రాధాన్యమని గట్టిగా చెప్పారు.

New Update
trump AI

Trump In AI Summit

అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ భారతీయులకు వ్యతిరేకమే. ఆయన మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా అమెరికా ఫస్ట్ నినాదంతోనే పని చేశారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. దానికి తగ్గట్టే అక్రమవలసదారులను వెళ్లగొట్టారు. వీసా రూల్స్ లో మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అమెరికాలోని పెద్ద టెక్ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి బలమైన సందేశం పంపించారు. ఇక మీదట టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్ల పై దృష్టి పెట్టాలని చెప్పారు. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్‌ కంపెనీల గ్లోబలిస్ట్‌ మైండ్‌సెట్‌ను ఆయన విమర్శించారు. ఏమైనా చేసే స్వేచ్ఛ ఉండడంతో చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇక మీదట అలాంటి ఆటలు చెల్లవని చెప్పారు. 

లాభాలు చాలు..దేశంపై దృష్టి పెట్టండి..

మన దేశంలోని చాలా భారీ టెక్‌ కంపెనీలు చైనాలో కంపెనీలు పెట్టాయి.ఇండియన్స్ ను జాబ్స్ లోకి ఎక్కువగా తీసుకుంటున్నాయి.  ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. దాంతో అమెరికన్లకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఇక మీదట చెల్లదు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్‌ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలి. టెక్ కంపెనీలు నా మాటను బాగా దృష్టిలో పెట్టుకోవాలని ట్రంప్ గట్టిగా చెప్పారు. ఈ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు ఏఐకు సంబంధించి మూడు కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు