Viral Video: ట్రెండ్ సెట్ చేద్దామని నడి రోడ్డు మీద కారుపై డ్యాన్స్.. చివరకు ఏమైందంటే?

ముంబైకి చెందిన 24 ఏళ్ల యువతి నాజ్మీన్ సుల్డే పబ్లిక్ అంతా ఉండగానే కదిలే మెర్సిడెస్-బెంజ్ కారు బోనెట్ మీద "ఆరా ఫార్మింగ్ డాన్స్" చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

New Update
Viral video

Viral video

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా మంది సాహసం చేసి మరి చేస్తున్నారు. పబ్లిక్‌ ఇబ్బంది పడతారని, ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా కూడా కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అయితే తాజాగా ముంబైలో ఓ యువతి కూడా ఇలానే వైరల్ కావాలని కారుపై డ్యాన్స్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన 24 ఏళ్ల యువతి నాజ్మీన్ సుల్డే పబ్లిక్ అంతా ఉండగానే కదిలే మెర్సిడెస్-బెంజ్ కారు బోనెట్ మీద "ఆరా ఫార్మింగ్ డాన్స్" చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిన ఈమె.. వీడియో వైరల్ కావాలని ఇలా చేసింది. ఈమెకు యూట్యూబ్‌లో లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 8.5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

పబ్లిక్‌లో స్టంట్ కొట్టడంతో..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శు వచ్చాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయి ఉండి ఇలా చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి స్టంట్స్ చేయడం వల్ల పబ్లిక్‌లో ఉన్నవారికి కూడా ఇబ్బంది కలుగుతుందని, ఇలాంటి వారికి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు నాజ్మీన్‌పై కేసు నమోదు చేశారు. ఈమెతో పాటు కారు నడిపిన తన బాయ్ ఫ్రెండ్ కూడా బుక్ అయ్యాడు. అతనికి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరిపై భారతీయ న్యాయ సంహిత, మోటర్ వెహికల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

Advertisment
తాజా కథనాలు