/rtv/media/media_files/2025/07/25/britan-2025-07-25-06-59-42.jpg)
Britain Doctor
సాధారణంగా తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఇన్సూరెన్స్ సంస్థల మీద జనాలు కోర్టుకు వెళుతుంటారు. కానీ ఈసారి బ్రిటన్ లో ఇన్సూరెన్స్ కంపెనీలే ఒక వ్యక్తి మీద కేసును వేశాయి. డబ్బులు కోసం తన కాళ్ళను తానే నరుక్కున్నాడంటూ కోర్టుకెక్కాయి. ఇన్సూరెన్స్ సంస్థలను తప్పుదోవ పట్టించి.. ఉద్దేశపూర్వకంగానే నెయిల్ హాపర్ అనే వ్యక్తి తన రెండు మోకాళ్లను తొలగించుకున్నారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం అక్కడ కోర్టులో నడుస్తోంది.
డబ్బుల కోసం కాళ్ళకు ఆపరేషన్..
నెయిల్ హాపర్ ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షల పౌండ్ల కోసం కక్కుర్తి పడ్డాడు. బాడీకి హాని కలగకుండా మోకాళ్లను తొలగించుకోవడం ఎలానో తెలుసుకునేందుకు ఓ వెబ్ సైట్ లో వీడియోలు కొనుగోలు చేశాడు. తర్వాత వాటి ఆధారంగా తనకు తెలిసిన మరో డాక్టర్ ద్వారా తన రెండు కాళ్ళను కట్ చేసేసుకున్నాడు. అనంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గరకు వెళ్ళాడు. తనకు రక్త నాళాల సమస్య ఉందని..మోకాళ్లు తొలగించుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పాడు. అందుకే తన కాళ్ళను తీయించుకున్నానని కంపెనీలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఇలాంటివి ఏమైనా చేస్తే ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పాలి. దాంతో సదరు సంస్థలు నెయిల్ క్లెయిమ్ ను పక్కన పెట్టారు. నెయిల్ ఇదే తరహాలో ఇతరుల కాళ్లను కూడా తొలగించేలా మారియస్ గుత్సావ్‌సన్ అనే వైద్యుడిని నెయిల్ ప్రోత్సహించారన్న అభియోగాలు వచ్చాయి. ఇవి ఇన్సూరెన్స్ కంపెనీల దృష్టికి వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను పని చేస్తున్న రాయల్ కార్నవాల్ ఆసుపత్రి ఉద్యోగం నుంచి తీసేశారు కూడా.
అయితే నెయిల్ హాపర్ మాత్రం తన కాళ్ళకు నిజంగానే ప్రాబ్లెమ్ ఉందని...అందుకే కాళ్ళు తొలగించుకున్నానని చెబుతున్నాడు. నిపుణులు సూచన మేరకే ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపాడు. కాళ్ళు ఉన్నప్పటి కంటే పోయిన తర్వాతే తన జీవితం బావుందని చెప్పుకొచ్చాడు.