Video Viral : శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!

గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా బర్రెపిల్ల అంటూ ఊగిపోయాడు. హరిహర వీరమల్లు సినిమా వారికి చెంపదెబ్బ, చెప్పుదెబ్బ అని అన్నారు.

New Update
shymala-roka

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'హరిహర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్  హీరోయిన్ గా నటించింది. ప్రిమియర్ షోస్ నుంచే అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేశారు. సినిమా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  

అందులో భాగంగా గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా బర్రెపిల్ల అంటూ ఊగిపోయాడు. హరిహర వీరమల్లు సినిమా వారికి చెంపదెబ్బ, చెప్పుదెబ్బ అని అన్నారు. పవన్ కల్యాణ్ కు సినిమాలు చేయడం తప్ప  వేరే బిజినెస్ లు ఏమీలేవన్నారు.రోజా తిరమలలో టికెట్లు అమ్ముకోని కోట్లు సంపాదించిదని ఆరోపించారు సాయి బాబా. హరిహర వీరమల్లు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Also Read :  పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!

Also Read :  ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!

మిశ్రమ స్పందన

'హరిహర వీరమల్లు' 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రను పోషించారు. మొఘల్ పాలకుల చేతుల్లో బందీగా ఉన్న ఒక నగరాన్ని విముక్తి చేయడానికి, అణగారిన ప్రజలలో ఆశను నింపడానికి వీరమల్లు విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక సాహసోపేతమైన మిషన్‌ను చేపడతాడు. విడుదలైన మొదటి రోజు, సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు ప్రశంసించగా, వీఎఫ్‌ఎక్స్ నాణ్యత, కథనం కొంత నిరాశపరిచిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. 

ఈ చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' (Sword vs Spirit) పేరుతో విడుదలైంది. క్లైమాక్స్‌లో దీని సీక్వెల్ 'హరిహర వీరమల్లు: పార్ట్ 2 – బ్యాటిల్‌ఫీల్డ్'   టైటిల్‌ను వెల్లడించారు. ఇక ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చు. 

Also Read :  తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?

Also Read :  ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు

telugu-cinema | tollywood | Hari Hara Veera Mallu | Gabbar singh artist

Advertisment
తాజా కథనాలు