BIG BREAKING :  రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్!

భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

New Update
veda

భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "పెద్ద కలలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చిన నేను బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు. కానీ, ఆటను ప్రేమించడమే తెలుసు. ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు, భారత జెర్సీ ధరించే వరకూ తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. ఈ రోజు మనస్ఫూర్తిగా నా కెరీర్‌కు ముగింపు పలుకుతున్నా. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వేద కృష్ణమూర్తి 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఆమె భారత జట్టుకు 48 వన్డేలు, 76 టీ20లలో ప్రాతినిధ్యం వహించారు. వన్డేల్లో 829 పరుగులు, టీ20ల్లో 875 పరుగులు సాధించారు. ముఖ్యంగా 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలు. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఆమె చివరి అంతర్జాతీయ మ్యాచ్.  2012లో డెర్బీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వేద 49 ఇన్నింగ్స్‌లలో 829 వన్డే పరుగులు చేసింది, ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

2021లో తీవ్ర విషాదం

కర్ణాటక మాజీ క్రికెటర్ అర్జున్ హొయసలను వివాహం చేసుకున్న 32 ఏళ్ల ఆమె క్రికెట్ నుంచి పూర్తిగా దూరం కానని, ఆటతో ఏదో ఒక విధంగా అనుబంధాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఆమె గతంలో డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున కూడా ఆడారు.వేద కృష్ణమూర్తి కర్ణాటకలోని కడూరు అనే చిన్న పట్టణంలో 1992 అక్టోబరు 16న జన్మించారు.  12 సంవత్సరాల వయస్సులో కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ఆమె తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. వేద క్రికెట్ కలను నెరవేర్చడానికి ఆమె తండ్రి కడూరు నుంచి బెంగళూరుకు మకాం మార్చారు. 2021లో వేద కృష్ణమూర్తి వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన తల్లి (చెలువమాబా దేవి), సోదరిని (వత్సల శివకుమార్) కోల్పోయారు. కేవలం మూడు వారాల వ్యవధిలో ఇద్దరూ మరణించారు.ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది.  

Also Read :  Rings with God : దేవుడి ప్రతిమతో ఉన్న ఉంగరాలు పెట్టుకోవచ్చా? మంచిదా, చెడ్డదా?

Advertisment
తాజా కథనాలు