Layoffs: ఐటీ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఆ ప్రముఖ కంపెనీలో 25 వేల మంది ఔట్!

ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ భావిస్తోంది.

New Update
Intel

Intel

ఈ మధ్య ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న కంపెనీలతో పాటు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రపంచంలోనే ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఇంటెల్ సుమారు 15 శాతం అంటే 15,000 మంది ఉద్యోగులను తగ్గించింది. అయితే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుంది.

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

ఇది కూడా చూడండి: OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

బిలియన్ డాలర్ల నష్టం..

ఇంటెల్ తన 2024 రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఈ లేఆఫ్‌లను ప్రకటించింది. కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 12.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని, సగటున 13.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే, ఇది విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువ. ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్‌లో ఇంటెల్ అగ్రస్థానంలో ఉండేది. 1990లలో పర్సనల్ కంప్యూటర్ల వాడకం పెరిగినప్పుడు మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో ఇంటెల్ ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఎన్‌విడియా వంటి కంపెనీలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

ఇది కూడా చూడండి: Varun Tej: సో క్యూట్.. అప్పుడే బేబీ కోసం వరుణ్ షాపింగ్.. ఏం కొన్నాడో చూడండి!

latest-telugu-news

Advertisment
తాజా కథనాలు