YCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!

YCP కీలక నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి జిల్లా ఎస్పీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన గన్ మెన్ ను సస్పెండ్ చేశారు. ఇటీవల మిథున్ రెడ్డితో ములాఖత్ కు వెళ్లిన సమయంలో గన్ మెన్ పెద్దిరెడ్డి బ్యాగులు మోశారు. ఇది విధుల్లో భాగం కాదంటూ.. ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Peddireddy Ram Chandra Reddy

మాజీమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. ఆయన గన్‌మెన్‌ కాలేషాను పోలీస్ శాఖ సస్పెండ్‌ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడంటూ ఎస్పీ వేటు వేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 23న మిథున్ రెడ్డితో పెద్ది రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డికి దిండు, ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లారు రాంచంద్రారెడ్డి. జైలులోకి భోజనం తీసుకెళ్లడంలో పెద్దిరెడ్డికి గన్‌మెన్‌ కాలేషా సాయం చేశారు. రామ చంద్రారెడ్డి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆయన పక్కన బ్యాగులు మోసుకుంటూ గన్ మెన్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

Also Read :  నా భార్య ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్!

YCP Ex. MP Peddireddy Gun Men Suspended

Also Read :  18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

అయితే.. ఇది గన్ మెన్ విధుల్లో భాగం కాదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ గన్ మెన్ కాలేషాపై వేటు వేశారు. కాలేషాను నుంచి విధుల్లోంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గన్‌మెన్‌ను తొలగించడంపై వైసీపీ సీరియస్ అయ్యింది. కూటమి ప్రభుత్వ కక్షతోనే గన్‌మెన్‌ను తొలగించిందంటూ ఫైర్ అయ్యింది. పెద్దిరెడ్డి చేతికి గాయమైందని.. ఈ నేపథ్యంలోనే గన్ మెన్ సహాయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

Also Read :  కొంపముంచిన ఫ్రూట్‌ జ్యూస్‌ డైట్..యూట్యూబ్‌ వీడియోలు చూసి

Also Read :  డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

telugu breaking news | telugu-news | mla peddireddy ramachandra reddy

Advertisment
తాజా కథనాలు