Cancer Symptoms in Telugu: మన శరీరంలో క్యాన్సర్ ను పసిగట్టడం ఎలా?

క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించకపోయినా, శరీరంలోని మార్పులను గమనిస్తే ముందే గుర్తించవచ్చు. గొంతు, బ్రెస్ట్, లివర్ వంటి క్యాన్సర్లకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి వైద్య సలహా తీసుకోవడం అవసరం.

New Update
Cancer Symptoms in Telugu

Cancer Symptoms in Telugu

Cancer Symptoms in Telugu: 

క్యాన్సర్ అనేది నెమ్మదిగా పెరిగే కణాల వ్యాధి. ఇది శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, సమీప భాగాలను ఆక్రమించడమో లేదా ఇతర అవయవాలకు వ్యాపించడమో చేస్తుంది. మరి, ఈ వ్యాధి మన శరీరంలో పెరుగుతున్నదని మనం ముందుగా గుర్తించగలమా?

సాధారణంగా చెప్పాలంటే తొలినాళ్లలో క్యాన్సర్ పెరుగుతున్నా మనకు ఎలాంటి చిన్న సూచనలూ కూడా కనిపించకపోవచ్చు. అనేక సందర్భాల్లో, క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి నొప్పి, ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. శరీరంలో చిన్న మార్పులు జరిగినా, మనం వాటిని సాధారణ సమస్యలుగా భావించేస్తాము.

Also Read:వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. విద్యుత్ షాక్‌కు చికిత్స అందించే విధానం ఇదే

అయితే, కొన్ని రకాల క్యాన్సర్‌లు కొన్ని లక్షణాల ద్వారా సంకేతాలు ఇస్తాయి. ఉదాహరణకి..

గొంతు క్యాన్సర్ (Throat Cancer): గొంతులో అసౌకర్యం, మాట్లాడడంలో తేడా

బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer): గడ్డలు, వాపు, నొప్పి

లివర్ క్యాన్సర్ (Liver Cancer): ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం

అంతర్గత అవయవ క్యాన్సర్‌లు: అలసట, అజీర్ణం, మలవిసర్జనలో మార్పులు

Also Read: మీ పిల్లలకు క్రాక్స్ చెప్పులు వేస్తున్నారా? అయితే.. ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..!

ఈ లక్షణాలు అనేక సందర్భాల్లో సాధారణ ఆరోగ్య సమస్యలతో కూడా వస్తాయి, అందువల్ల అవి క్యాన్సర్‌కు సంబంధించినవేమోనని పసిగట్టడం చాలా కష్టం. కానీ, మన శరీరాన్ని మనం ఎప్పుడూ గమనించాలి. ఏదైనా అసాధారణ మార్పులు నెలల పాటు కొనసాగితే, వైద్యులను సంప్రదించడం అత్యంత ముఖ్యం.

ముఖ్యంగా, వంశపారంపర్యంగా క్యాన్సర్ ఉన్నవారికి మరింత అప్రమత్తత అవసరం. క్రమం తప్పకుండా హెల్త్ చెక్ అప్ లు చేసుకోవడం, జీవనశైలిలో ఆరోగ్యపరమైన మార్పులు తెచ్చుకోవడం ఎంతో అవసరం.

క్యాన్సర్ మన శరీరంలో పెరుగుతున్నదన్న అంచనాను మనం నేరుగా తెలుసుకోలేము. కానీ శరీరమిచ్చే సంకేతాలను గమనిస్తే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆరోగ్యంపై అప్రమత్తత, కాలక్రమేణా ప్రాణాలను రక్షించగలదు.

Also Read:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

NOTE: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు