TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!

తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను దళారులు మోసం చేశారు. ప్రతి భక్తుని నుంచి రూ.1,500 చొప్పున వాహన క్లీనర్ వెంకటేష్‌కు రూ.8500 వసూలు చేశారు. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

New Update
TTD

TTD

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల విశ్వాసాన్ని కొందరు దళారులు మోసం చేస్తున్నారు. ఇటీవల అలిపిరి వద్ద ఘటించిన ఒక ఘటన ఈ విషయాన్ని మరోసారి వెల్లడించింది. 23 జూలై 2025 వేకువజామున 2.30 గంటల సమయంలో తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న సుమారు 24 మంది భక్తులు దళారుల లక్ష్యంగా మారారు. ఈ భక్తులు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఈ సమయంలో కె. వెంకటేష్, డి. వెంకటేష్ అనే ఇద్దరు టాక్సీ డ్రైవర్లు క్యూ లైన్‌లో వేచి లేకుండా నేరుగా ఉచిత దర్శనం ఇప్పిస్తామని చెప్పి వారి నమ్మకాన్ని పొందారు.

Also Read :  టెన్త్లో 92 శాతం మార్కులు.. చనిపోయిన అమ్మ పిలిచిందని సూసైడ్!

ఉచిత దర్శనం పేరుతో భక్తులకు మోసం..

ప్రతి భక్తుని నుంచి రూ.1,500/- చొప్పున వసూలు చేసిన దళారీలు.. వారి వాహనాలలో తిరుమలకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న మరో దళారి అయిన వాహన క్లీనర్ వెంకటేష్‌కు రూ.8500 ఇచ్చారు. అతను తిరుమలలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ప్రైవేట్ భద్రతా గార్డు (PSG) అయిన పి. సాయి కుమార్‌కు రూ.8000/- లంచంగా ఇచ్చి ఎమర్జెన్సీ గేట్ తాళం చెవి పొందాడు. అనంతరం ఉదయం 8.00 గంటల ప్రాంతంలో తిరుమలలోని VQC-II ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలోని సబ్ స్టేషన్ ఎదుట ఉన్న ఎమర్జెన్సీ గేట్‌ను వాహన క్లీనర్ వెంకటేష్ తెరిచి టోకెన్ల కొరకు వచ్చిన భక్తులను అక్రమంగా లోపలకు పంపించారు.

ఇది కూడా చదవండి: పచ్చి పాలతో చర్మం మెరుస్తుంది.. నల్లటి మచ్చలు మాయమవుతాయి

ఈ భక్తులు టోకెన్లు పొందిన తరువాత ఎగ్జిట్ అయి తిరిగి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో Re-Entry ద్వారంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం కలిగింది. వారు భక్తులను విచారించగా అసలు విషయం బయటపడింది. దళారీలు భక్తులను మోసం చేసి అక్రమంగా దర్శనం కోసం పంపిన విషయం బట్టబయలైంది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల II టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టాక్సీ డ్రైవర్లు కె. వెంకటేష్, డి. వెంకటేష్, వాహన క్లీనర్ వెంకటేష్ మరియు PSG సాయి కుమార్‌లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై టీటీడీ అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. భద్రతా వ్యవస్థలో ఈ రకమైన లోపాలు భక్తుల భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున.. విచారణతోపాటు కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

Also Read :  'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!

( ttd | AP News | AP News Latest | ap news today | Latest News | telugu-news )

Advertisment
తాజా కథనాలు