Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దంచికొడుతున్నాడు. ప్రస్తుతం 425 రన్స్ తో సెకండ్ లీడ్ స్కోరర్ గా ఉన్న పంత్..మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సీరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలుస్తాడు. 

New Update
Rishabh Pant

Rishabh Pant Photograph: (Rishabh Pant)

రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలు...25, 9 రన్స్..ఇదీ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్కోర్లు. మొదటి టెస్ట్ నుంచి పంత్ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం 425 రన్స్‌తో సిరీస్‌లో సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడు. మిగా రెండు మ్యాచ్ లు కూడా రిషబ్ కచ్చితంగా ఆడతాడు. మరిన్ని పరుగులు చేయడం ఖాయం. జులై 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్ జరగనుంది. దీంట్లో కనుక రిషబ్ బాగా ఆడితే అతని ఖాతాలో కొత్త రికార్డ్ చేరుతుంది. 

61 ఏళ్ళ నాటి రికార్డ్..

రిషబ్ పంత్ వైస్ కెప్టెనే కాదు భారత జట్టు వికెట్ కీపర్ కూడా. ఇతను మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సీరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా పంత్ నిలుస్తాడు.  అంతకు ముందు ఈ రికార్డ్ కుందరన్ పేరు మీద ఉంది. 1964లో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత పర్యటనకు వచ్చింది. అప్పుడు కుందరన్‌ 10 ఇన్నింగ్స్‌ల్లో 525 రన్స్ చేశారు. దీంతో పాటూ  500కుపైగా పరుగులు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్ ఇతనే. ప్రస్తుతం రిషబ్ పంత్ స్కోరు 425. అంటే మరో 101 పరుగులు చేస్తే పంత్...కుందరన్ రికార్డ్ ను బీట్ చేసేస్తాడు. అదే ఓవరాల్ గా అగ్రస్థానంలో నిలవాలంటే మాత్రం 181 పరుగులు చేయాలి. దక్షిణా ఆఫ్రికా ఆటగాడు డెనిస్ లిండ్స్ 606 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. పంత్ వికెట్ కీపర్ కాబట్టి అన్నీ ఆడతాడు. కాస్త జాగ్రత్తగా ఆడితే అతను కచ్చితంగా డెనిస్ స్కోర్ ను అధిగమించి..ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తాడు. 

Also Read: AAIB: ఏం జరిగిందో చెప్పాం..దర్యాప్తు ఇంకా పూర్తవలేదు..ఏఏఐబీ

Advertisment
Advertisment
తాజా కథనాలు