/rtv/media/media_files/2025/07/18/arshdeep-singh-injured-ahead-of-4th-test-team-india-fast-bowler-2025-07-18-07-00-15.jpg)
arshdeep singh injured ahead of 4th test team india fast bowler
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2 తేడాతో వెనుకబడింది. టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరిగింది. ఇందులో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో భారత జట్టు 193 పరుగుల లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేదించలేకపోయింది.
arshdeep singh injured
ఇప్పుడు ఇరు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ జూలై 23 (బుధవారం) నుండి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు సన్నాహాలు ముమ్మరం చేసింది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత ఆటగాళ్లు బెకెన్‌హామ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
బెకెన్‌హామ్ నుండి వచ్చిన విజువల్స్‌లో.. అర్ష్‌దీప్ సింగ్ ఎడమ చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నుంచి కానీ, జట్టు మేనేజ్‌మెంట్ నుంచి కానీ దీని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇది కూడా చూడండి: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా లేదా మరే ఇతర ఫాస్ట్ బౌలర్ విశ్రాంతి తీసుకుంటే అర్ష్‌దీప్ మాంచెస్టర్ టెస్ట్ కోసం ప్లేయింగ్-11లోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా అర్ష్‌దీప్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చూడండి: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!