/rtv/media/media_files/2025/07/18/delhi-high-court-2025-07-18-07-33-22.jpg)
Delhi High Court
కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు నలుగురికి న్యాయమూర్తి తగినబుద్ధి చెప్పారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు నిందితులకు ఢిల్లీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. చేతులు పైకెత్తి కోర్టు హాలులో రోజంతా నిలబడాలని ఆదేశించింది. 2018కి సంబంధించిన ఓ కేసు తుది విచారణలో జ్యుడీషియల్ మేజిస్ట్రేటు సౌరభ్ గోయల్ ఈ శిక్ష విధించారు.
విచారణలో భాగంగా ఉదయం 10 నుంచి 11.40 గంటల మధ్య వేచి ఉండి, రెండుసార్లు పిలిచినా నిందితులు బెయిల్ బాండ్లు సమర్పించలేదు. కోర్టు సమయం వృథా చేయడమంటే మా ఉత్తర్వులను ధిక్కరించడమే. ఐపీసీలోని 228వ సెక్షను కింద నిందితులు కోర్టు సమయం ముగిసేదాకా చేతులను నిటారుగా పైకెత్తి నిలబడాలి’’ అని జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ కేసు నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే మృతిచెందగా.. కుల్దీప్, రాకేశ్, ఉపాసన, ఆనంద్ మిగిలారు. మధ్యాహ్నం 12.48 గంటల ప్రాంతంలో కుల్దీప్ బెయిలు బాండ్లతోపాటు దరఖాస్తును సమర్పించడంతో.. కోర్టు కస్టడీ నుంచి అతడి విడుదలకు జడ్జి అనుమతించారు.