Madhavilatha : బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...

బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్‌ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

New Update
Madhavilatha

Madhavi latha

బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్‌ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై మాధవీలత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  మాధవీలత వ్యాఖ్యలకు గోషామహల్ బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలెట్టారు. అంతేకాక రాజసింగ్ విషయంపై సైలెంట్ గా  ఉండాలని పార్టీ చెప్పినప్పటికీ ఆ వ్యాఖ్యలు మాధవీలత కు పట్టవా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీని కాదని ఏ హోదాలో సొంత పైత్యం వెళ్లగక్కుతుందని మాధవీలత పై నేతలు మండిపడుతున్నారు.

Also Read :  అక్రమ సంబంధం పెట్టుకుందని..తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!

Also Read :  మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడో తెలిసిపోయింది..

Madhavilatha Flame In BJP

మాధవీలతపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ లీడర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల మాధవీలత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదంటూ మాధవీలత ను బీజేపీ హెచ్చరించింది. మాధవీలత ఎపిసోడ్‌ పార్టీకి తలనొప్పిగా మారిందని వాపోతున్నారు. దీంతో అలెర్ట్ అయిన కమలం పార్టీ నేతలు ఎవరు కాంట్రవర్సీ మాటలు మాట్లాడకూడదని ప్రెస్ నోట్ విడుదల చేసింది.మొత్తం మీద మాధవీలత వ్యాఖ్యలు పార్టీ మొత్తానికి చిచ్చు పెట్టాయని కాషాయ శ్రేణులు అంటున్నాయి.

Also Read :  హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయం

Also Read :  సాయిపల్లవిని సీతగా సెలెక్ట్ చేయడం వెనుక కారణం ఇదేనటా!

goshamahal-news | goshamahal mla raja singh | goshamahal | BJP leader Madhavilatha | telangana-bjp-leaders | telangana-bjp

Advertisment
Advertisment
తాజా కథనాలు