USA: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో అమెరికా కీల నిర్ణయం తీసుకుంది. దానిని ఉగ్రవాద సంస్థ అని ప్రకటించింది. లష్కరే తోయిబా ముసుగులో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ అని చెప్పింది. 

New Update
marco

Trump, Marco Rubio

ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. టూరిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. ప్రపంచమంతా ఆ దాడిని ఖండించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్..పాక్ పై దాడులు చేపట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. తర్వాత పాక్ కూడా కాల్పులు నిర్వహించింది. తరువాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఘటనపై అమెరికా ఇప్పుడు మళ్ళీ స్పందించింది. 

టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థే..

పహల్గాందాడిని తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే గ్రూప్ ప్రకటించింది. పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో ఇది పని చేస్తోంది. అయితే ఈ దాడి ముందు వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమెరికా ఈ టీఆర్ఎఫ్ ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో చెప్పారు. ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌’ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు తెలిపారు.  2008 తర్వాత భారత్ లో ముంబయ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన అతి పెద్ద అటాక్ పహల్గామేనని మార్క్ రూబియో అధికారిక ప్రకటన చేశారు. అలాగే అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇది తమ పరిపాలన నిబద్ధత అని చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు