/rtv/media/media_files/2025/07/18/hyderabad-software-employee-incident-2025-07-18-12-50-50.jpg)
HYD Software Employee Suicide
HYD Software Employee Suicide: అతడి పేరు వాలివేటి హితేష్. అతడికి 29 ఏళ్లు. అతి చిన్న వయస్సులోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్నాడు. నెలకు రూ.2లక్షల జీతం. ఒక అపార్ట్‌మెంట్‌లో తన తమ్ముడు, ఫ్రెండ్స్‌తో అద్దెకు ఉంటూ హ్యాపీగా జీవిస్తున్నాడు.
ఉరేసుకుని మృతి (Software Employee Suicide)
కానీ తన ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువకుడు కుంగి, కృశించి.. చివరికి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఎవరూ సంపాదించలేనంత జీతం తీసుకున్న అతడు.. ఒక అమ్మాయి కారణంగా చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్(Hyderabad) రాయదుర్గంలోని(Rayadurgam) ల్యాంకో హిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో(Lanco Hills Apartments) వాలివేటి హితేష్ (29) తన తమ్ముడు, ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. అతడు ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తూ నెలకు రూ.2లక్షల జీతం తీసుకుంటున్నాడు. అతడికి ఓ ప్రియురాలు కూడా ఉంది. కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య పలు కారణాల వల్ల గొడవలు జరిగాయి.
ఈ క్రమంలోనే ఆ యువతి హితేష్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రియురాలు వదిలేయడంతో హితేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ యువతితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ కుంగిపోయాడు. ఆమె మళ్లీ తన జీవితంలోకి తిరిగి రాదని భావించి కృశించిపోయాడు. దీంతో తాను ఉంటున్న ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం తమ్ముడు ప్రమోద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.