/rtv/media/media_files/2025/07/18/himantha-2025-07-18-10-22-09.jpg)
Assam CM Himantha Biswa Sarma
రాహుల్ గాంధీ వ్యాఖ్యల కారణంగా తమ రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారని..పోలీసులపైనే దాడులు చేశారని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారు. కబ్జాదారులకు పునరావాసం కల్పిస్తామని, ఇళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. దీని కారణంగా అస్సాంలోని ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. పోలీసులపైనే దాడి చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీకి వచ్చిన రాహుల్ గాంధీ ప్రసంగాల వల్లనే ఇదంతా జరిగిందని హిమంత ఆరోపించారు. పోలీసులు రాహుల్ ప్రసంగాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. అందులో హింసను ప్రేరేపించినట్లు తేలితే రాహుల్, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. గాంధీల కోసం అస్సాంలో జైళ్ళు ఎదురు చూస్తున్నాయని రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు.
రాజనుకుంటున్నారు..
అంతకు ముందు అస్సాం పర్యటనలో రాహుల్ గాంధీ సీఎం హిమంత బిస్వా శర్మపై మండిపడ్డారు. ఆయన తనకు తానే రాజా అనుకుంటాడు. కానీ త్వరలో జైలుకు వెళ్తాడు అని అన్నారు. అస్సాంలోని చాయ్‌గావ్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అవినీతికి సీఎం, ఆయన కుటుంబాన్ని ప్రజలు బాధ్యులుగా చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ఆయనను జైలులో పెట్టదు. ప్రజలే ఆయనను జైలులో పెడతారని రాహుల్ గాంధీ విమర్శించారు.