USA:  ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 70పైనే ఉంటుంది.  దీంతో ఆయన దీర్ఘకాల సిరల వ్యాధి వీనస్ ఇన్ సఫీషియన్స్ తో బాధపడుతున్నారు. అయితే ఇది సాధారణ వ్యాదేనని..కంగారుపడవలసిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించారు. 

New Update
trump health

White House Announcement On Trump Health

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ళ కిండ, చీలమండ దగ్గర వాపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది వైద్యులకు చూపించారు. వైద్య పరీక్షల అనంతరం ట్రంప్ దీర్ఘకాల సిరల వ్యాధితో బాధపడుతున్నారని తేల్చారు. అయితే ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధేనని..70 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తుందని చెప్పారు. శరీరంలో ఉండే సాధారణ సిరల లోపమేనని..భయపడాల్సిన పరిస్థితి లేదని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ తెలిపారు. డీప్ వీనస్ థ్రోబోసిస్ లేదా ఆర్టీరియల్ వ్యాధి కాదని చెప్పారు. అలాగే మొత్తం బాడీ ఫుల్ చెకప్ చేయించామని...హార్ట్, కిడ్నీలు అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని తెలిపారు. 

ఏం పర్లేదు బాగానే ఉన్నారు..

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని వైట్ హౌస్ ప్రకటించింది. చీలమండ వాపు వల్ల ఆయనకు ఎలాంటి అసౌకర్యం కలగడం లేదని తెలిపింది. తన ఆరోగ్యం పట్ల పారదర్శకత ఉండాలనే ఈ విషయం మీడియా ముందు చెబుతున్నామన్నారు. అలాగే ట్రంప్ చేయి వెనుక ఉండే గాయం లాంటి దాని గురించి కూడా లీవిట్ స్పందించారు. రెగ్యులర్ గా షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆస్పిరిన్ వాడడం లాంటి వల్ల అక్కడ మచ్చలా అయిందని..అది గాయం కాదని చెప్పారు. దాని గురించి వైద్యులు పరీక్ష చేస్తున్నారని తెలిపారు.  

Also Read: Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం

Advertisment
Advertisment
తాజా కథనాలు