Telangana Rain Update: తెలంగాణలో జోరువాన.. ఈ జిల్లాల్లో దంచికొట్టేస్తుంది

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. రాబోయే 2 గంటలు ఆగకుండా మధ్యస్తంగా నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాలలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Telangana Rain Update (1)

Telangana Rain Update

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో  రాత్రి కుండపోత వర్షం కురిసింది. ప్రతి చోట 60-100 మి.మీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల 150 మి.మీ మేర భారీ వర్షాలు కురిశాయి. 

Telangana Rain Update

రాబోయే 2 గంటలు ఆగకుండా మధ్యస్తంగా నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాలలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుందని.. సాయంత్రం నుంచి- వర్షాలు కురుస్తాయని సూచించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు