/rtv/media/media_files/2025/07/18/hyderabad-crime-news-2025-07-18-13-14-32.jpg)
Hyderabad Crime News
TG Crime: హైదరాబాద్‌లో ఓ మహిళకు ఊహించని షాక్ ఎదురైంది. ఒకవైపు తల్లి అయిన ఆనందంలో ఉండగా.. మరోవైపు జీవితంలో ఊహించని సమస్యలు ఎదురైంది. కూకట్‌పల్లిలో ఓ మహిళకు జరిగిన ఈ ఘటన అందుకు ఉదాహరణ. నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఐటీ ఉద్యోగి నికిత.. నల్లూరి శ్రవణులు శాంతినగర్‌లో నివసిస్తున్నారు. పెళ్లి సమయంలో నికిత ఇచ్చిన కట్న డబ్బులతో ఓ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత ఇద్దరి పేరుపై బ్యాంక్ లోన్ తీసుకొని ఆ ఇంటిని కొనుగోలు చేశారు. వారి సొంతం చేసుకున్న ఇంట్లో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.
ప్రసవానికి వెళ్లి వచ్చే వరకు..ఊహించని షాక్:
అయితే గర్భవతైన నికిత.. ఇటీవల ప్రసవానికి పుట్టింటికి వెళ్లింది. ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చి కొన్ని నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి షాకింగ్ విషయం ఎదురైంది. తాము కొనుకున్న ఇంటిలో ఇంకొ కుటుంబం నివాసం ఉన్నారు. ఏమైందో తెలియక అవాక్కయిన నికిత.. అక్కడ ఉన్నవారిని అడిగితే మేము అద్దెకు వచ్చాం.. ఓనర్ ఎవరంటే? మీ భర్తే చెప్పారు. కానీ వాళ్లు వచ్చి కలవడం లేదని చెప్పారు. ఇది విని ఆమె కంగుతిన్నారు. భర్త శ్రవణ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందన లేదు. తనకు తెలియకుండానే భర్త ఇల్లు అమ్మేశాడని, తాను పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం జరిపాడని నికిత అనుమానం వ్యక్తం చేశారు.
భార్య పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి ఇల్లును అమ్మేసిన భర్త
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2025
కూకట్‌పల్లి - శాంతి నగర్లో నివాసం ఉంటున్న నికితా, శ్రావణ్ దంపతులు
ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో, కాన్పు కోసం పుట్టింటికి వెళ్లి అక్కడే ఉన్న నికితా
ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఇంటి నెలనెలా EMI కడుతున్న… pic.twitter.com/f7x19Z240R
ఇల్లు అమ్మిన విషయాన్ని తెలుసుకున్న నికిత కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా నిలిచారు. నికితతో పాటు వారి బంధువులు ఇంటి ముందు బైఠాయించారు. న్యాయం చేయాలని.. ఇల్లు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. భర్త చేసిన ఈ చర్యపై నికిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన జీతంతో కూడిన డబ్బులు, కట్నం ద్వారా ఇచ్చిన నగదు మొత్తం ఇంటి కొనుగోలులో ఖర్చుపెట్టామని.. కానీ తనకు తెలియకుండానే ఇల్లు అమ్మాడని ఆమె ఆరోపిస్తున్నారు. చివరకు నికిత కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: దంపతుల్లో పెరుగుతున్న ఒబెసిటీ ప్రమాదం.. ICMR హెచ్చరికలు తెలుసుకోండి
( TG Crime | Latest News | telugu-news)
ఇది కూడా చదవండి: చియా విత్తనాల నీరుతో బరువుకు చెక్.. ఈ సులభమైన మార్గాలను పాటించండి