AAIB: ఏం జరిగిందో చెప్పాం..దర్యాప్తు ఇంకా పూర్తవలేదు..ఏఏఐబీ

ఇంధన స్విచ్ లు ఆఫ్ అయ్యాయంటూ ఏఏఐబీ ప్రథమిక దర్యాప్తు ఇచ్చింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో విపరీత కథనాలు వచ్చాయి. పైలెటే స్విచాఫ్ చేశాడంటూ రాశాయి. దీంతో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని..అప్పుడే నిర్ధారణకు రావొద్దంటూ ఏఏఐబీ స్పష్టం చేసింది. 

New Update
Air India Crash victims' families claim forced financial disclosures

Air India Crash victims' families claim forced financial disclosures

కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ లో కూలిన విమాన ఘటన అత్యంత విషాదంగా మారని సంగతి అందరికీ తెలిసిందే. ఫ్లైట్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో మొత్తం 240 మంది ప్రయాణికులతో పాటూ మరో 30 మంది ప్రాణాలు పోయాయి. ప్రమాదం తర్వాత ఫోటోలు, వీడియోలు, బ్లాక్ బాక్స్ తదితర వాటిని పరిశీలించాక దీనిపై ప్రాథమిక నివేదికను సమర్పించింది ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే యాక్సిడెంట్ కు కారణమని తేల్చింది.

అయితే దీని తర్వాత అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తులో పైలెట్ల ఇద్దరి మాటలను కూడా చెప్పింది. ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలెట్...రెండో పైలెట్ ను అడిగారని తెలుస్తోంది. అయితే మొదటి పైలెట్ తాను స్విఛాఫ్ చేయలేదని చెప్పారని...తర్వాత మేడే కాల్ ఇచ్చారని ఏఏఐబీ నివేదికలో చెప్పింది. దీనిపై మీడియాలో కావాలనే పైలెట్ ఇంధన స్విచ్ ను షట్ డౌన్ చేశారని రాశాయి. పైలెట్ల చివరి మాటల్లో ఇది స్పష్టం అవుతోందని తేల్చేశారు. 

తొదరపడి నిర్ధారణ వద్దు..

దీనిపై ఏఏఐబీ స్పందించింది. ప్రాథమిక దర్యాప్తులోని అంశాలపై వస్తున్న వ్యాఖ్యానాలను ఖండించింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని..అప్పుడే నిర్ధారణకు రావడం మంచిది కాదని చెప్పింది. నిరాధారమైన, ధ్రవీకరించని నివేదికలతో విమాన ప్రమాదం మీద ఒక నిర్ణయానికి రావొద్దని చెప్పింది. దర్యాప్తు కొనసాగుతున్న దశలో.. ఇటువంటి చర్యలు బాధ్యతారహితమైనవి’’ అని ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఒక ప్రకటనలో చెప్పారు. ఇలాంటి వాటి వలన విమానయానాలపట్ల ప్రజల్లో అనవసరంగా ఆందోళన సృష్టించొద్దని అన్నారు. ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది. విమాన సంఘటన దర్యాప్తుల విషయంలో తమకు మచ్చలేని రికార్డ్ ఉందని ఏఏఐబీ చెప్పింది. 2012లో ఏర్పాటైనప్పటి నుంచి 92 ప్రమాదాలు, 111 ఘటనలను దర్యాప్తు చేసినట్లు వివరించింది. అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారమే పకడ్బందీగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఏఏఐబీ తెలిపింది. 

Also Read: USA: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు