/rtv/media/media_files/2025/07/17/attempted-murder-on-congress-leader-2025-07-17-21-19-44.jpg)
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదిభట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
పెద్దఅంబర్‌పేట్ నుంచి బెంగుళూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. మృతులు మాలోత్ చందులాల్ (29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)గా గుర్తించారు.