/rtv/media/media_files/2025/07/18/maharastra-vs-telangana-2025-07-18-12-30-12.jpg)
Maharashtra Telangana Villages Issue: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా(Adilabad District), కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని(Kumurambheem Asifabad District) 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం(Merger with Maharashtra) చేసే ప్రక్రియ మొదలైందంటూ మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే చేసిన ప్రకటన సంచలనంగా మారింది.14 గ్రామాల ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, వారు మహారాష్ట్రలోనే ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం సుముఖంగా ఉందన్న మంత్రి .. ఈ గ్రామస్తుల డిమాండ్లను తాము పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. దీంతో ఇది కాస్త తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేసింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. కేసీఆర్ పాలనలో మహారాష్ట్ర నుండి 14 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలవాలని కోరుకున్నారని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నరలోనే జరిగిన విధ్వంసం, నాయకత్వ వైఫల్యం.. తెలంగాణ నుండి 14 గ్రామాలను తీసుకోవాలనుకుంటోందంటూ మండిపడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలను కూడా కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఏపీలో కలిపిదంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. అప్పుడు ఐదు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఇప్పుడు 14 గ్రామాలను తెలంగాణ నుంచి దూరం చేసేందుకు మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వంతీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలున్న భూములను పరిష్కరించకుండా మహారాష్ట్రలో విలీనం చేస్తామని చెప్పడం సరికాదని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.
ఇరు రాష్ట్రాల పాలనలో
ప్రస్తుతం ఈ14 గ్రామాలు ఇరు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో పరంధోళి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించలేదు. పట్టాల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. గ్రామాలను అనుసంధానిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఇక 20 శాతం గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించింది. 70 శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలకు హక్కులు కల్పించకపోవడంతో.. వారిలో చాలామంది మహారాష్ట్రలో కలుస్తామని చెబుతున్నారు. అయితే ఈ 14 గ్రామాల ప్రజలనుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయానికి కొంతమంది సపోర్ట్ చేస్తుండగా.. తమకు తెలంగాణ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటామని మరికొందరు చెబుతున్నారు. ఏ ప్రభుత్వం సాగు భూములకు పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతామని మరికొందరు చెబుతుండటం విశేషం.