AK-203 Rifle : భారత అమ్ములపొదిలో మరో ఆయుధం.. ఏకే 203... దీని ప్రత్యేకత ఏంటంటే?

భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. అందులో భాగంగా కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది. నిమిషానికి 700  రౌండ్లు ఫైర్ చేయగల ఈ రైఫిల్‌లు త్వరలోనే సైన్యానికి చేరనున్నాయి.

New Update
AK-203 Rifle

AK-203 Rifle

భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ప్రజాస్వామ్య దేశంగా తన ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా రెట్టింపు చేసుకుంటోంది. అయితే మన దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని దాయాది దేశాలు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలో దేశ సరిహద్ధులతో పాటు దేశంలోనూ ఉగ్రదాడులకు ఉసిగొల్పుతున్నాయి.ముఖ్యంగా పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలు పక్కలో బళ్లేంలా తయారయ్యాయి. ఈ క్రమంలో  భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. అందులో భాగంగా కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది. నిమిషానికి 700  రౌండ్లు ఫైర్ చేయగల ఈ రైఫిల్‌లు త్వరలోనే సైన్యానికి చేరనున్నాయి. 8--0-0 మీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేధించగలగడం దీని ప్రత్యేకత.

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

Another Weapon In India's Arsenal - AK 203

ఈ రైఫిళ్లను భారతరష్యా భాగస్వామ్యంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో ఏర్పాటు చేసిన ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (IRRPL) తయారు చేస్తోంది. కాగా వీటికి 'షేర్‌'పేరుతో తయారుచేస్తోంది. 6,01,427 ఏకే 203 రైఫిళ్లను తయారు చేయడానికి రూ.5,200 కోట్ల కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. అయితే వీటిని 2032 అక్టోబరు నాటికి అందజేయాల్సి ఉండగా, అనుకున్న సమయానికంటే 22 నెలల ముందు అంటే 2030 నాటికే వీటిని భద్రతా దళాలకు అందజేస్తామని ఐఆర్‌ఆర్‌పీఎల్‌ సీఈఓ అండ్ -మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌.కె.శర్మ తాజాగా వెల్లడించారు. కాగా ఇప్పటికే దాదాపు 48 వేల రైఫిళ్లను ఇచ్చేశామని, మరో మూడు వారాల్లోగా మరో 7 వేల రైఫిళ్లు అందజేస్తామని, డిసెంబరు నాటికి 15 వేల రైఫిళ్లు అదనంగా అందజేయడానికి సిద్దంగా ఉన్నామని శర్మ వెల్లడించారు.

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

ప్రస్తుతం భారతదేశంలో వినియోగిస్తున్న ఏకే-47, ఏకే-57 కంటే కలాష్నికోవ్‌ సిరీస్‌లో ఈ ‘షేర్’ తుపాకులు అంత్యంత ఆధునికమైనవే కాక ప్రమాదకరమైనవి కూడా. సాయుధ దళాలు అనేక సంవత్సరాలుగా వినియోగిస్తున్న ఇన్సాస్‌ రైఫిళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టాలని  ఆర్మీ  భావిస్తోంది. ఇన్సాస్‌ రైఫిల్ కాలిబర్‌ 5.62 ఎంఎం కాగా..ఏకే 203 రైపిళ్లు 7.62 ఎంఎం కాలిబర్‌తో తయారు చేశారు. కాగా  ఈ రైపిల్‌ బరువు 3.8 కేజీలు కాగా.. ఇన్సాస్ 4.15 కేజీల బరువుంటుంది. పొడవు కూడా వాటికంటే తక్కువే.  షేర్ పొడవు 705ఎంఎంగా మాత్రమే. దేశ సరిహద్దులు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న  మన సైనికుల చేతికి ఈ తుపాకులు అందితే.. మన బలగాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాదాన్ని మరింత సామర్థ్యవంతంగా ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Also Read:ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

Also Read :  హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయయం

india russia ties | Indo-Russian alliance | india-russia | russia | good news to indian army | indian army action | Indian Army

Advertisment
Advertisment
తాజా కథనాలు