/rtv/media/media_files/2025/07/18/uddhav-thackeray-meets-devendra-fadnavis-2025-07-18-14-50-30.jpg)
Uddhav Thackeray meets Devendra Fadnavis day after 'join us after 2029' remark
ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోతున్నాయి. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. మళ్లీ బీజేపీ కూటమితో కలవనున్నట్లు ప్రచారం నడుస్తోంది. గురువారం ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అవ్వడమే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది. విధాన మండలి ఛైర్మన్ రామ్ శిండే కార్యాలయంలో వీళ్లిద్దరూ సమావేశమయ్యారు. 20 నిమిషాల పాటు వీళ్ల భేటీ జరిగింది. అధికార పక్షం వైపు రావాలని ఉద్ధవ్ ఠాక్రేను సీఎం ఫడ్నవీస్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అది జరిగిన మరుసటి రోజే వీళ్లద్దరూ సమావేశం అయ్యారు.
బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 వరకు మేము ప్రతిపక్షంలోకి వెళ్లే ఛాన్సే లేదన్నారు. అందుకే ఉద్ధవ్ ఠాక్రే అధికార పక్షం వైపు వచ్చే అవకాశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉద్ధవ్.. ఫడ్నవీస్‌ను కలవడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయం అవుతోంది. ఉద్ధవ్ మళ్లీ బీజేపీతో కలవనున్నారని ప్రచారం కూడా సాగుతోంది.
Also Read: అడవిలో ఒంటరిగా జీవించిన రష్యా మహిళ.. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భర్త
Also Read : బీజేపీ లో మాధవీలత చిచ్చు..పార్టీ లైన్ దాటి..
Uddhav Thackeray Meets Devendra Fadnavis
ఇదిలాఉండగా మహారాష్ట్రలో బీజేపీ, శివసేవ 2014 వరకు స్నేహంగా ఉండేవి. 25 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ పార్టీల్లో 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు వల్ల విభేదాలు వచ్చాయి. చివరికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శివసేన బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. చివరికి రెండున్నరేళ్ల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ధవ్ ఠాక్రేపై ప్రతీకారం తీర్చుకున్నారు.2022లో ఏక్‌నాథ్ శిండేతో తిరుగుబాటు చేయించి శివసేన రెండు ముక్కలయ్యేలా చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో శిండే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రెండేళ్లకు పైగా ఆయనే సీఎంగా ఉన్నారు.
Also Read: బంగ్లాదేశ్ నుంచి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. అదే జరిగితే భారత్ ఒంటరి!
ఆ తర్వాత 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి(బీజేపీ+శివసేన(షిండే)+ఎన్‌సీపీ(అజిత్ పవార్)) అధికారంలోకి వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ విద్యా విధానంలో (NEP) భాగంగా కేంద్రం త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అంశం తమిళనాడులో తీవ్ర వివదాం కాగా.. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వివాదం చెలరేగింది. విపక్షాలు, ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో చివరికి మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంలో వెనక్కి తగ్గింది. అయితే తాజాగా ఫడ్నవీస్.. ఉద్దవ్ ఠాక్రేను అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించడం, ఆ తర్వాత వీళ్లిద్దరూ సమావేశం కావడం చర్చనీయాంశమవుతోంది.
Also Read : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయయం
devendra fadnavis | uddav-thakrey | maharashtra | rtv-news | telugu-news