/rtv/media/media_files/2025/07/17/ranadheer-2025-07-17-22-27-36.jpg)
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్
తమ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోనక్కర్లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ నాటోకు మెత్తగా గడ్డి పెట్టారు. రష్యాతో వాణిజ్య విషయంలో నాటూ చీఫ్ బెదిరింపులను కొట్టిపారేశారు. రష్యా వైఖరిని అందరూ చూస్తున్నారని..ఏ దేశం వారు ఆ దేశం అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారని జైశ్వాల్ చెప్పారు. భారత ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే తమ అత్యంత ప్రాధాన్యత అని అన్నారు. మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామన్నారు. అలాగే ద్వంద్వ ప్రమాణాల పట్ల జాగ్రత్తగా ఉంటామని కూడా చెప్పారు.
భారీ ఆంక్షలు ఎదుర్కోక తప్పదు..
అంతకు ముందు బ్రెజిల్, చైనా, భారత్ లు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. నిన్న అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ కు కొత్త ఆయుధాలు ఇస్తామని ప్రకటించడంతో పాటూ రష్యాకు వారి నుంచి వస్తువులు కొనుగోలు చేసే వారిపై అధిక సుంకాలు వసూలు చేస్తామిహెచ్చరించారు. ఈరోజు నాటో కూడా అదే వార్నింగ్ ఇచ్చింది. చైనా, భారత్, బ్రెజిల్ దేశాధినేతలు రష్యాతో వ్యాపారం చేస్తే వారి దగ్గర నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని చెప్పారు. మాస్కో శాంతి చర్చలకు ముందుకు రాకపోతే ఆ దేశంతో పాటూ వారితో వ్యాణిజ్యం చేసేవారికి కూడా 100 శాతం సుకాలు విధిస్తామని హెచ్చరించారు. అలా జరగకుండా ఉండాలంటే పుతిన్ ను శాంతి చర్చలకు ఒత్తిడి చేయాలని చెప్పారు.