🔴Live News Updates: ఈ ఫార్ములా కేసులో ACBకి కేటీఆర్ లేఖ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Crime News: బిడ్డ ప్రాణం తీసిన బీడీ ముక్క.. తండ్రి కాల్చిపడేయడంతో..!
తండ్రి కాల్చి పడేసిన బీడీముక్క 10 నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. లక్ష్మీదేవి భర్త బీడీ కాల్చి చివరిముక్క పడేశాడు. దాన్ని తమ బిడ్డ నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు.
Mangalore 10 month old baby dies after swallowing beedi
అభం శుభం తెలియని 10 నెలల పదికందు బీడీ ముక్కకు బలైంది. తండ్రి కాల్చి పడేసిన చివరిముక్కను నోట్లో పెట్టుకుని ప్రాణం వదిలింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని మంగళూరు నగర శివారు అడ్యార్‌లో బిహార్‌కు చెందిన లక్ష్మీదేవి కుటుంబం నివాసముంటోంది. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఉదయం లక్ష్మీదేవి భర్త రోజులాగే బీడీ కాల్చి చివరి ముక్కను పడేశాడు.
అది చూసిన తమ అనీశ్‌కుమార్ (10 నెలల కుమారుడు) దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్త గొంతులోకి పోయి ఇరుక్కుంది. బయటకు రాక.. లోపలకి వెళ్లకపోవడంతో ఆ బాలుడు చాలా ఇబ్బందిపడ్డాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఇరుక్కున్న బీడీ ముక్కను బయటకు తీసేందుకు సతవిధాలా ప్రయత్నించారు.
కానీ రాకపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ గొంతులో ఇరుక్కున్న బీడీ ముక్కను బయటకు తీసేలోపే ఆ 10 నెలల పసికందు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారం ఏసీబీకి లేఖ రాశారు. విచారణలో పర్సనల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులకు పంపింది. ఏసీబీ అధికారుల నోటీసులకు కేటీఆర్ బదులుగా లేఖలో సమాధానం ఇచ్చారు.
ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో పడేసి వెళ్లారు.
Ongole murder
Jun 18, 2025 20:42 IST
గర్భిణికి సిజేరియన్.. కడుపులోనే సూది మర్చిపోయిన వైద్యులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pregnant woman
Jun 18, 2025 18:59 IST
ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM
ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
Jun 18, 2025 17:11 IST
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A8 బూనేటి చాణక్య 2 తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దీంతో ఈకేసులో టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ బ్లాక్ మనీతో చాణక్య సినిమాలు తీశాడా అని అనుమానం వ్యక్తమతుంది.
Jun 18, 2025 15:59 IST
కవిత సంచలన నిర్ణయం.. ‘స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకుంటాం’
తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్‌లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్కో వార్డులో వందల కొద్దీ నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.
Jun 18, 2025 14:41 IST
ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఇదిగో ప్రూఫ్.. షర్మిల సంచలనం!
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
YS Sharmila
Jun 18, 2025 14:40 IST
జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
Jagan’s Convoy Vehicle Kills a Man in Guntur
Jun 18, 2025 14:40 IST
వాహనదారులకు గుడ్ న్యూస్..రూ.3వేలకే ఏడాదంత ట్రిప్స్
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని ఈజీ చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ పై మరోక కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 2025 నుంచి వార్షికంగా ఫాస్టాగ్ పాస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది.
Jun 18, 2025 13:47 IST
Murder: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..గొంతుకోసి...
ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటానంటే నమ్మింది. అతనితో పాటు ఏడడుగులు నడవాలని ఆశపడింది. పెళ్లిపేరుతో బెంగళూరు నుంచి గోవాకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు. ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Jun 18, 2025 13:10 IST
Volcanic Eruption: బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం
ఇండొనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది మంగళవారం సాయంత్రం విస్పోటనం చెందింది.
Jun 18, 2025 13:06 IST
Train blast Pakistan: భారీ బాంబ్ బ్లాస్ట్.. స్పాట్‌లో 6 రైలు బోగీలు..! (వీడియో)
పాకిస్తాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెషావర్ నుండి పాకిస్తాన్‌లోని క్వెట్టాకు వెళ్తున్న రైలులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో రైలులోని 4 నుంచి 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు.
Pakistan Jaffar Express Train Derails After Bomb Explosion
Jun 18, 2025 12:53 IST
Zelio E Mobility: చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ మైలేజ్!
ప్రముఖ జెలియో-ఇ మొబిలిటీ కంపెనీ మరో లెజెండర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. బేస్ జెల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.65వేలు, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.75,000, హైరేంజ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,000గా కంపెనీ నిర్ణయించింది.
Zelio E Mobility Launches Legender Facelift At Rs 65000
Jun 18, 2025 11:52 IST
PM Modi : కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన మోదీ
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు తేల్చి చెప్పారు. జీ7 దేశాల సమావేశానికి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈ మేరకు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
trump and modi Photograph: (trump and modi )
Jun 18, 2025 11:18 IST
BIG BREAKING: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో కొడాలి నాని అరెస్ట్..
మాజీమంత్రి వైసీపీ నేత కొడాలినానిని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీఅయిన విషయం తెలిసిందే.
Kodali nani
Jun 18, 2025 11:18 IST
Iran-Israel War : యుద్ధం మొదలైందన్న ఖమేనీ... రంగంలోకి అమెరికా
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో ప్రపంకలను సృష్టిస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా జీ7 దేశాల మద్ధతు కూడగట్టడంలో విజయం సాధించిన ట్రంప్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ద రంగంలోకి నేరుగా దూకడానికి సిద్ధమవుతున్నారు.
Jun 18, 2025 11:16 IST
New Trains: దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్రకటన చేశారు. కొత్త రైళ్లలో 50 నమో భారత్, 100 మెమూ, 50 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయి.
indian railways to launch 200 new trains soon
Jun 18, 2025 11:16 IST
Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ జూలై 25న రిలీజ్..!
‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటూ జూలై 25న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇవాళ అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.
Hari Hara Veera Mallu
Jun 18, 2025 10:01 IST
Road Accident: ఊహించని మృత్యువు.. ఫ్లైఓవర్ పైనుంచి వ్యాన్ పడి నలుగురు స్పాట్‌డెడ్
ఆగ్రాలోని షాహ్దరా చుంగి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళుతున్న వ్యాన్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి కింద కూర్చున్న మార్నింగ్ వాకర్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident at Shahdara Chungi Flyover 4 Killed,1 Injured
Jun 18, 2025 09:22 IST
Harbhajan Singh: ‘నేను ఒక రోజు పంజాబ్ సీఎం అయితే’.. క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్
తనను ఒక రోజు పంజాబ్ సీఎంని చేస్తే ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో క్రికెటర్ హర్బజన్‌సింగ్ చెప్పారు. ‘పిల్లల విద్యను మెరుగుపరచడం నా మొదటి దృష్టి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలి’ అని చెప్పారు.
harbhajan singh interesting comments on one day cm of punjab
Jun 18, 2025 09:21 IST
Encounter: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు మృతి
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ తో పాటు మరో మావోయిస్టు హతమయ్యారు.
Jun 18, 2025 09:21 IST
PM Modi : ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదు: మోదీ
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా పర్యటనలో భాగంగా జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి.. మానవత్వంపై జరిగిన దాడి. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి. దీన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Jun 18, 2025 08:08 IST
Cricketer Died: విమాన ప్రమాదంలో యువ క్రికెటర్ మృతి..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ఇంగ్లాండ్ వెళ్తున్న యువ క్రికెటర్ దిర్ధ్ పటేల్ మరణించారు. అతడు ఇంగ్లాండ్‌లోని లీడ్స్ మోడరనియన్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నారు. ఆయన మరణానికి లీడ్స్ క్లబ్ సంతాపం తెలిపింది.
Cricketer Died in Ahmedabad Air India Plane Crash (1)
Jun 18, 2025 08:07 IST
PM Modi : ఇండియా, కెనడా దౌత్యవేత్తల పునర్ నియామకం
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీకి కెనడాలో ఘన స్వాగతం లభించింది. మోదీ పలువురు నేతలతో భేటీ అయ్యారు. కాగా కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక తర్వాత తొలిసారి ప్రధాని మోదీ ఆయనతో సమావేశమయ్యారు.
Jun 18, 2025 07:39 IST
Israel-Iran War : ఇరాన్ పై బాంబుల వర్షం... ఇజ్రాయెల్ లో రెడ్ అలెర్ట్
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదురుతోంది. దాడులు ప్రతి దాడులతో రెండు దేశాల మధ్య వార్ ఫీక్ స్టేజీకి చేరుకుంది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధవిమానాలు, క్షిపణుల దాడులతో ఇరువైపుల తీవ్ర నష్టం వాటిల్లింది.
Jun 18, 2025 07:25 IST
TG RAIN UPDATE: తెలంగాణలో 5 రోజులు వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల్లో దంచుడే
తెలంగాణలో నేటి నుంచి 5రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.