Harbhajan Singh: ‘నేను ఒక రోజు పంజాబ్ సీఎం అయితే’.. క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్

తనను ఒక రోజు పంజాబ్ సీఎంని చేస్తే ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో క్రికెటర్ హర్బజన్‌సింగ్ చెప్పారు. ‘పిల్లల విద్యను మెరుగుపరచడం నా మొదటి దృష్టి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలి’ అని చెప్పారు.

New Update
harbhajan singh interesting comments on one day cm of punjab

harbhajan singh interesting comments on one day cm of punjab

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పాలిటిక్స్, క్రికెట్, తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పలు అంశాలు పంచుకున్నారు. తనను ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రిని చేస్తే, రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో చెప్పారు. 

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

ఒకరోజు ముఖ్యమంత్రి అయితే

తాను ఒకరోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే.. పిల్లల విద్యను మెరుగుపరచడం తన మొదటి దృష్టి అని అన్నారు. దీని తరువాత రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. హర్భజన్ క్రీడలను తన మూడవ ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. క్రీడలు యువతకు దిశానిర్దేశం చేయడమే కాకుండా.. మొత్తం వ్యవస్థను మార్చగల శక్తిని కలిగి ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

ఆస్ట్రేలియాకు కోచ్‌గా

అలాగే భారతదేశం తరఫున కాకుండా వేరే ఏ దేశ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉండాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. తన హృదయం ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటుందని, అందుకే తాను భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. భారతదేశం కాకుండా వేరే ఏ జట్టు పేరు అయినా చెప్పాల్సి వస్తే.. తాను ఆస్ట్రేలియాను ఎంచుకుంటానని అన్నారు. ఆస్ట్రేలియా జట్టు ప్రొఫెషనల్ వైఖరి, బలమైన వ్యవస్థ, మ్యాచ్ తయారీ విధానం తనకు నచ్చిందని అన్నారు. 

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

రాజకీయాల్లో చేరడం గురించి 

రాజకీయాల్లో చేరడం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. అలాంటి పరిస్థితులు తలెత్తితే.. పంజాబ్‌కు తన అవసరం అనిపిస్తే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను వెనుకాడనని అన్నారు. యువత ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని తాను నమ్ముతున్నానని తెలిపారు. 

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు