Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ జూలై 25న రిలీజ్..!

‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటూ జూలై 25న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇవాళ అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.

author-image
By Seetha Ram
New Update
Hari Hara Veera Mallu

Hari Hara VeeraMallu

పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ కూడా ఇవాళ మేకర్స్ అందిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా వైరల్‌గా మారాయి. దాని ప్రకారం.. ఈ మూవీని జూలై 25న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. 

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

Hari Hara Veera Mallu Release Date 

వాస్తవంగా ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందున ఈ సినిమాను వాయిదా వేశారు. వాస్తవ కథతో హరి హర వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. అవసరాన్ని బట్టి  గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ జోడించినట్లు తెలిపారు. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

ఈ సినిమా టెక్నికల్ వర్క్ ఇరాన్ తో పాటు ఇతర దేశాల్లో జరిగిందని తెలిపారు. ఇంకా పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, హడావిడిగా చివరి నిమిషంలో విడుదల చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం. ఈ సినిమా సుమారుగా నాలుగు సార్లు వాయిదా పడింది. దాంతో అభిమానుల ఆశలు, ఉత్సాహంపై నీళ్లు జల్లినట్టు అయింది. ఇప్పుడు జూలై 25న రిలీజ్ చేసే అవకాశం ఉందని నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు