Israel-Iran War : ఇరాన్ పై బాంబుల వర్షం... ఇజ్రాయెల్ లో రెడ్ అలెర్ట్

ఇరాన్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం మరింత ముదురుతోంది. దాడులు ప్రతి దాడులతో రెండు దేశాల మధ్య వార్‌ ఫీక్‌ స్టేజీకి చేరుకుంది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధవిమానాలు, క్షిపణుల దాడులతో ఇరువైపుల తీవ్ర నష్టం వాటిల్లింది.

New Update
Iran Israel Conflict

Israel-Iran War

Israel-Iran War : ఇరాన్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం మరింత ముదురుతోంది. దాడులు ప్రతి దాడులతో రెండు దేశాల మధ్య వార్‌ ఫీక్‌ స్టేజీకి చేరుకుంది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధవిమానాలు, క్షిపణుల దాడులతో ఇరువైపుల తీవ్ర నష్టం వాటిల్లింది.ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్‌ సైనికాధికారి, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారు అయిన అలీ షాద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ దళాలు వెల్లడించాయి. ఇరాన్‌ దాడిలో  ఇజ్రాయెల్‌లోని మొస్సాద్‌ కేంద్ర కార్యాలయం ధ్వంసమవ్వడంతో పాటు, డ్రోన్ల తయారీ యూనిట్‌ దెబ్బతింది. రెండు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

ఆర్థిక మూలాలపై దాడులు

 టెహ్రాన్‌ గగన తలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఇప్పటికే120 క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది. టెహ్రాన్‌ విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దాడుల్లో ఇరాన్‌ ప్రత్యేక ఎలైట్‌ దళం కుడ్స్‌ ఫోర్స్‌కు చెందిన 10 కమాండ్‌ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. మరోవైపు ఇరాన్‌ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడానికి ఇరాన్‌ బ్యాంకులపై ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడులకు పాల్పడుతోంది.  

 ఈ క్రమంలోనే ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌ను దీటుగా ఎదుర్కొంటుంది.దాదాపు 20 బాలిస్టిక్‌ క్షిపణులను టెల్‌ అవీవ్‌పై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. మొస్సాద్‌ ప్రధాన కార్యాలయంపైనా ఇరాన్‌ దాడులు చేసినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లో మొస్సాద్‌ ఏర్పాటు చేసుకున్న డ్రోన్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్‌ సైనిక నిఘా కాంప్లెక్స్‌పైనా క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్‌ తెలిపింది. ఇప్పటిదాకా 370 క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది.  ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లోని హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం ధ్వంసమైంది. 

ఇజ్రాయెల్‌లో రెడ్‌ అలర్ట్‌

కాగా ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ లో రెడ్‌ అలర్ట్‌ విధించారు. బాంబుల వర్షంతో మిడిల్‌ ఈస్ట్‌ మండిపోతుంది. రెండు దేశాల యుద్ధ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు సూచించారు. ఇరాన్‌ దాడిలో ఇజ్రాయెల్‌లో భారీ భవనాలు సైతం నేలకూలుతున్నాయి. ఇక ఇజ్రాయెలో చిక్కుకున్న ఇతర దేశాలవారిని తమ తమ దేశాలకు రావాలని ఆయా దేశాలు కోరుతున్నాయి. గగన తలాన్ని మూసివేయడంతో భూమార్గంలో తమ దేశాలకు రావాలని పిలుపునిచ్చాయి. 

ఇజ్రాయెల్ కు తోడుగా అమెరికా

ఇరాన్‌లో ఏ క్షణంలోనైనా పెద్ద దాడి జరగొచ్చనే వదంతులతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే ఇరాన్ లో గల నంతాజ్, ఫార్దో అణుకేంద్రాలను అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ధ్వంసం చేయబోతోందనే వార్తలు గుప్పు మన్నాయి. ఇదే జరిగితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోలనలో ఉన్నారు. అణుబాంబులు తయారు చేయడానికి ఇరాన్ వద్ద దాదాపు 90 శాతం శుద్ధి చేసిన యురేనియం సిద్ధంగా ఉండటంతో.. ఫార్దోలోని పర్వతం లోపాల నిర్మించిన అణుశక్తి కేంద్రాన్ని నాశనం చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, భారీగా ఆయుధాలు పశ్చిమాసియా సరిహద్దుల్లోకి చేరుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

నేడు ఢిల్లీకి తొలిబ్యాచ్

టెహ్రాన్‌లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు, వెంటనే నగరాన్ని వదిలి ఆర్మేనియా సరిహద్దు ద్వారా స్వదేశానికి రావాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఇప్పటికే సుమారు 110 మందితో కూడిన భారతీయుల బృందం అఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియాకు చేరుకుంటున్నారు.మరోవైపు టెహ్రాన్‌లోని భారతీయులు, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని వీడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది.  ఇరాన్‌లో చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థులు అర్మేనియా చేరుకున్నారు. వీరు బుధవారం ఢిల్లీకి రానున్నారని వెల్లడించింది. మరోవైపు టెహ్రాన్‌లోని భారతీయులు, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని వీడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది. 


 ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌


ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరస్పర దాడుల నేపథ్యంలో ఆ రెండు దేశాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ప్రారంభించింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా తాము ఉంటున్న దేశాల్లోకానీ, ప్రయాణాల్లోకానీ ఇబ్బంది పడుతున్న తెలంగాణవాసులు కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. వందన- రెసిడెంట్‌ కమిషనర్‌ పీఎస్‌- +91 9871999044, జి.రక్షిత్‌నాయక్, లైజన్‌ ఆఫీసర్‌- +91 9643723157, జావేద్‌ హుస్సేన్, లైజన్‌ ఆఫీసర్‌- +91 9910014749, సీహెచ్‌ చక్రవర్తి,  పౌరసంబంధాల అధికారి- +91 9949351270.

Advertisment
Advertisment
తాజా కథనాలు