/rtv/media/media_files/2025/06/07/8DDJPk3M879eGccnWODE.jpg)
Kannappa
Kannappa: మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమా వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమైన హైకోర్టు.. జూన్ 17 మంగళవారం ఈ కేసును విచారణకు తీసుకుంది.
Also Read : 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ...
కోర్టులో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతానికి సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్ని అవరోధాలు వచ్చినా జూన్ 27న సినిమా విడుదల చేస్తాం అనే ప్రకటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు తరఫున హాజరైన అడ్వకేట్ కోర్టుకు చూపారు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: మీరు ప్రతిరోజూ వాటర్ చెస్ట్‌నట్ తింటే ఏమవుతుంది? నిజాలివే!
ప్రతివాదులైన సెన్సార్ బోర్డు తదితరుల వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీరు కౌంటర్ ఇవ్వకపోతే నోటీసులు అందుకున్న తరువాత కూడా హాజరుకాకపోతే, అనుమతులు లేకుండా సినిమా రిలీజ్ చేస్తే కోర్టు చట్ట ప్రకారం.. తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. అలాగే తదుపరి విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదే రోజున కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా వివాదం ఇప్పటికే వివిధ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆగ్రహంతో పాటు సెన్సార్ బోర్డు ఆలస్యం, చిత్రబృందం ముందస్తు ప్రకటనలు అన్నీ కలిపి ఈ చిత్రం చుట్టూ చట్టపరమైన మేఘాలను కమ్ముతున్నాయి. జూన్ 27న సినిమా విడుదలపై తుది నిర్ణయం హైకోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!
Also Read : కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు
( aaa-cinimas | Latest News | manchu mohan babu | Manchu Vishnu )
Follow Us