/rtv/media/media_files/2025/06/18/Zelio E Mobility Launches Legender Facelift At Rs 65000-70b4f204.jpg)
Zelio E Mobility Launches Legender Facelift At Rs 65000
ప్రముఖ జెలియో(ZELIO)-ఇ మొబిలిటీ తన లైనప్‌లో ఉన్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. లెజెండర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని బేస్ జెల్ బ్యాటరీతో వచ్చే 32AH వేరియంట్ ధర రూ. 65,000గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో దీని లిథియం-అయాన్ బ్యాటరీతో వచ్చే 60V/30A వేరియంట్ ధర రూ.75,000గా ఉంది. తర్వాత 74V/32A బ్యాటరీతో వచ్చే వేరియంట్ ధర రూ.79,000గా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
Legender Facelift
ఈ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు కలర్ ఆప్షన్లలో సేల్కు అందుబాటులో ఉంది. ఇందులో రస్టీ ఆరెంజ్, గ్లోసీ గ్రీన్, గ్లోసీ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త ఫేస్ లిఫ్టెడ్ లెజెండర్ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీనికి ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ చెప్పింది. ఇది 60/72V హై-పవర్ BLDC మోటారును కలిగి ఉంది.
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1.5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. దీని మొత్తం బరువు 98 కిలోలుగా ఉంది. ఇది గుంతలు గల రోడ్లపై కూడా బాగా పరుగులు పెడుతుంది. ఇక దీని ఛార్జింగ్ సమయం గురించి చెప్పుకుంటే.. లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్ 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అయితే జెల్ బ్యాటరీ వేరియంట్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 8 గంటలు పడుతుంది.
ఈ వేరియంట్‌కు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, సౌకర్యవంతమైన డిజైన్, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఫీచర్లు అందించామని జెలియో కంపెనీ సహ వ్యవస్థాపకుడు కునాల్ ఆర్య చెప్పారు. కొత్త లెజెండర్.. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, శక్తివంతమైన వెనుక హబ్ మోటారుతో వస్తుంది. ఈ స్కూటర్ భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ ఉన్నాయి.
అందువల్ల ఇది గుంతలగల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీనితో పాటు స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్, టెయిల్ల్యాంప్, ఇండికేటర్లు ఈ స్కూటర్లను మరింత అందాన్నిచ్చాయి. అలాగే ఇందులో ఉండే డిజిటల్ డ్యాష్‌బోర్డ్ అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
కీలెస్ ఎంట్రీ, మొబైల్ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్ డిటెక్షన్, ప్రాక్సిమిటీ లాక్-అన్‌లాక్, పార్క్ అసిస్ట్, ఫాలో-మీ-హోమ్ లైట్లు, SOS అలర్ట్‌లు, క్రాష్, ఫాల్ డిటెక్షన్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ZELIO కంపెనీ తన కస్టమర్లకు వెహికల్‌పై 2 సంవత్సరాల వారంటీని, అన్ని బ్యాటరీ వేరియంట్లపై 1 సంవత్సరం వారంటీని అందిస్తోంది. ఇది కాకుండా మొదటి 1,000 మంది కస్టమర్లకు ఉచిత సేఫ్టీ హెల్మెట్ కూడా అందిస్తుంది.