Cricketer Died: విమాన ప్రమాదంలో యువ క్రికెటర్ మృతి..

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ఇంగ్లాండ్ వెళ్తున్న యువ క్రికెటర్ దిర్ధ్ పటేల్ మరణించారు. అతడు ఇంగ్లాండ్‌లోని లీడ్స్ మోడరనియన్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నారు. ఆయన మరణానికి లీడ్స్ క్లబ్ సంతాపం తెలిపింది.

New Update
Cricketer Died in Ahmedabad Air India Plane Crash  (1)

Cricketer Died in Ahmedabad Air India Plane Crash

జూన్ 12న అతి పెద్ద ఘోరం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది. ఆ విమానం నేరుగా వెళ్లి బిజె మెడికల్ కాలేజ్ అండ్ సివిల్ హాస్పిటల్ హాస్టల్ భవనంపై కూలిపోవడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు, పదుల సంఖ్యలో మెడికల్ స్టూడెంట్స్, సమీపంలో ఉన్న ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

Ahmedabad Air India Plane Crash 

ఈ ప్రమాదంలో ఇంగ్లాండ్ వెళ్తున్న యువ క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా మరణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 23 ఏళ్ల దిర్ధ్ పటేల్ కూడా ఉన్నారు. దిర్ధ్ పటేల్ ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అతను ఎయిర్‌డేల్ & వార్ఫెడేల్ సీనియర్ క్రికెట్ లీగ్ తరపున ఆడుతున్నాడు. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

లీగ్ ప్రకారం.. లండన్‌కు వెళ్లే దారిలో కూలిపోయిన విమానంలో అతడు ఉన్నాడు. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన దిర్ధా పటేల్ మరణానికి లీడ్స్ క్లబ్ సంతాపం తెలిపింది.. ఈ మేరకు ఆయనకు నివాళులర్పించింది. అతని మరణ వార్తతో క్లబ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

దిర్ధ్ క్రికెట్ విజయాలు

2024లో లీడ్స్ మోడరన్యన్స్ CC తరపున విదేశీ ఆటగాడిగా దిర్ధ్ పటేల్ ఆడాడు. అతను ఫస్ట్ ఎలెవెన్ తరపున 20 మ్యాచ్‌ల్లో 312 పరుగులు చేసి 29 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను తన మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. తన కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత ‘ఫారిన్ ఆరిజిన్ ఇంగ్లీష్ రెసిడెంట్ ప్లేయర్’గా నమోదు చేసుకోవాలనే కల అతనికి కలిగింది. దీంతో దిర్ధ్  హడర్స్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎం.ఎస్సీ పూర్తి చేశాడు.

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు